ఆదిత్యపురికి టాటా లీడర్‌షిప్ అవార్డు
Sakshi Education
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్యపురికి 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఏఐఎంఏ-జేఆర్‌డీ టాటా కార్పొరేట్ లీడర్‌షిప్ అవార్డు లభించింది.
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోఫిబ్రవరి 27న జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి ఈ అవార్డును ప్రదానం చేశారు. దేశంలో ఒకానొక ఉత్తమ బ్యాంకర్, ఇనిస్టిట్యూషన్ నిర్మాణదారునిగా, వినూత్నమైన సంప్రదాయ, ఆధునిక బ్యాంకు రూపశిల్పిగా ఆదిత్యపురిని ఏఐఎంఏ ప్రశంసించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏఐఎంఏ-జేఆర్‌డీ టాటా కార్పొరేట్ లీడర్‌షిప్ అవార్డు 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్యపురి
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏఐఎంఏ-జేఆర్‌డీ టాటా కార్పొరేట్ లీడర్‌షిప్ అవార్డు 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్యపురి
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 28 Feb 2019 05:04PM