Skip to main content

అద్దె గర్భం నియంత్రణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Current Affairsఈ మేరకు అద్దె గర్భం నియంత్రణ బిల్లు-2020పై ఫిబ్రవరి 26న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. వితంతువులు, విడాకులు పొందిన వారూ ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లు స్పష్టం చేసింది.

సరోగసీ చట్టాలను సవరిస్తూ 2019, ఆగస్టులో లోక్‌సభ ఒక ముసాయిదా బిల్లును ఆమోదించింది. అయితే దగ్గరి బంధువులే అద్దెకు గర్భాన్ని ఇవ్వొచ్చనే నిబంధనపై విమర్శలొచ్చాయి. దీంతో బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని కమిటీ సరోగసీకి సంబంధించి అన్ని వర్గాల వారితోనూ చర్చించి బిల్లులో సవరణలను ప్రతిపాదించింది. ఈ సవరణలను కేబినెట్ తాజాగా ఆమోదించింది.

అద్దె గర్భం బిల్లులోని ముఖ్యాంశాలు
  • కేంద్రం, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిల్లో జాతీయ సరోగసీ బోర్డుల ఏర్పాటు
  • అద్దెకు గర్భాన్ని ఇచ్చే మహిళకు చేసే బీమా మొత్తాన్ని 36 నెలలకు పెంపు.
  • మానవ పిండాలు, గామేట్స్ (బీజం) కొనుగోలు, విక్రయాలపై నిషేధం. నైతిక సరోగసికి మాత్రమే అనుమతి.
  • భారతీయ దంపతులు, భారతీయ సంతతి దంపతులు, 35-45 ఏళ్ల వితంతు మహిళ లేదా విడాకులు పొందిన మహిళలకే సరోగసి అనుమతి

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అద్దె గర్భం నియంత్రణ బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి వీలుకల్పించేందుకు
Published date : 27 Feb 2020 05:23PM

Photo Stories