ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
Sakshi Education
అనకాపల్లి బెల్లం పౌడర్కు ఇండియన్ పేటెంట్ లభించింది. ఈ విషయాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎ.విష్ణువర్దన్రెడ్డి ప్రకటించారు.
ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధన స్థానం (అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్)లో 62వ కిసాన్‌మేళా మార్చి 25న ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విష్ణువర్దన్ మాట్లాడుతూ... అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పంటకోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన విభాగ శాస్త్రవేత్తలు రూపొందించిన బెల్లం పౌడర్ తయారీకి జాతీయస్థాయిలో పేటెంట్ లభించిందన్నారు. గుంటూరులో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది.
Published date : 27 Mar 2021 05:05PM