Skip to main content

అభివృద్ధిపై భారత్, నేపాల్‌ సమీక్ష

భారత ఆర్థిక సాయంతో నేపాల్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఇరుదేశాల దౌత్యవేత్తలు ఆగస్టు 17న ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు.
Current Affairs
నేపాల్‌ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శంకర్‌ దాస్‌ బైరాగి, భారత దౌత్యవేత్త వినయ్‌ మోహన్ క్వాత్రాల నేతృత్వంలో ఈ సమావేశాలు జరిగాయి. భారత్‌కు చెందిన కొన్ని ప్రాంతాలను తమవిగా ప్రకటించి నేపాల్‌ కొత్త మ్యాపులు సిద్ధం చేసిన నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దుల వివాదం మొదలైన తరువాత ఈ స్థాయి సమావేశం జరగడం ఇదే మొదటిసారి.

దవండి: నేపాల్ కొత్త మ్యాప్ కు రాజ్యాంగ బద్ధత 

భారత్‌తో విభేదాల పరిష్కారానికి సిద్ధం
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి, విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి, పరస్పర రాజకీయ విశ్వాసాలను అభివృద్ధి చేసుకొనేందుకు భారత్‌తో కలిసి పనిచేయ డానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. సరిహద్దుల విషయంలో పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించి ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావోలిజియన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : నేపాల్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : నేపాల్‌ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శంకర్‌ దాస్‌ బైరాగి, భారత దౌత్యవేత్త వినయ్‌ మోహన్ క్వాత్రా
Published date : 18 Aug 2020 04:42PM

Photo Stories