Skip to main content

94వ ఆస్కార్‌ అవార్డుల వేడుకను ఎక్కడ నిర్వహించనున్నారు?

94వ ఆస్కార్‌ అవార్డుల వేడుకకు తేదీ ఖరారైంది. 2022, మార్చి 27న లాస్‌ ఏంజెల్స్‌లోనిడాల్బీ థియేటర్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆస్కార్‌ నిర్వాహకులు వెల్లడించారు.
Current Affairs
ఆస్కార్‌కు షార్ట్‌ లిస్ట్‌ చేయబడిన చిత్రాలను 2021, డిసెంబరు 21న, ఆస్కార్‌ నామినేషన్స్‌ ప్రకటనను 2022, ఫిబ్రవరి 8న అవార్డుల ప్రదానోత్సవాన్ని 2022, మార్చి 27న జరపనున్నట్లు తెలిపారు.

సాధారణంగా ఆస్కార్‌ వేడుకలు ఫిబ్రవరిలో జరుగుతాయి. కోవిడ్‌ కారణంగా 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన 93వ ఆస్కార్‌ అవార్డుల వేడుక ఏప్రిల్‌లో జరిగింది. ఇంకా 2022 ఏడాది బీజింగ్‌లో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ (ఫిబ్రవరి 4– 20), లాస్‌ ఏంజెల్స్‌లో జరగనున్న ప్రముఖ ఫుట్‌బాల్‌ లీగ్‌ల కారణంగా ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి 2022 మార్చి 27వ తేదీని ఆస్కార్‌ ప్రతినిధులు ఎంచుకున్నట్లు సమాచారం.
Published date : 04 Jun 2021 02:48PM

Photo Stories