Skip to main content

9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌కు రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ అక్టోబర్ 18న మరో రికార్డ్ ఘనత సాధించింది.
ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.9,05,214 కోట్లను తాకింది. దీంతో రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను తాకిన తొలి భారత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన ఘనతను ఈ కంపెనీ 2018 ఏడాది ఆగస్టులోనే సాధించింది. మరో రెండేళ్లలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 20,000 కోట్ల డాలర్ల(రూ.14 లక్షల కోట్లకు)కు పెరగగలదని ఇటీవలే బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. అక్టోబర్ 18ప ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,428ను తాకింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను తాకిన తొలి భారత కంపెనీ
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ
Published date : 19 Oct 2019 05:30PM

Photo Stories