80వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
Sakshi Education
గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవాడియా పట్టణంలో నవంబర్ 25, 26వ తేదీలలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగింది.
ఈ సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. సదస్సులో రాష్ట్రపతి మాట్లాడుతూ... ప్రజల విశ్వాసం పొంది, ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలని సూచించారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్...
సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రసంగిస్తూ... ప్రజాస్వామ్యం వెలుగులు విరజిమ్మాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని అన్నారు. కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 26న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. జమిలి ఎన్నికలు (‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’) ఆలోచన అనేది కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేయలేమని, ఈ ఆలోచన ప్రస్తుతం దేశ అవసరమని మోదీ అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సు
ఎప్పుడు : నవంబర్ 25, 26
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కేవాడియా పట్టణం, నర్మదా జిల్లా, గుజరాత్

Published date : 27 Nov 2020 06:13PM