7 కాదు... 6.1 శాతమే వృద్ధిరేటు !
Sakshi Education
భారత్ ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను తగ్గిస్తున్న పలు సంస్థల జాబితాలో తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా చేరింది.
2019లో వృద్ధి కేవలం 6.1 శాతంగానే నమోదవుతుందని తన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఏప్రిల్ అంచనా (7.3 శాతం)తో పోల్చితే తాజా అంచనా ఏకంగా 1.2 శాతం తక్కువ. నిజానికి ఏప్రిల్‌లో 7.3 శాతం అంచనావేసిన మూడు నెలల తర్వాత ఈ రేటును 7 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. తాజాగా ఈ అంచనాను మరింత తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజా అంచనాలకు సరిసమానంగా ఐఎంఎఫ్ అంచనా ఉండడం గమనార్హం. 2018లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతం. తాజా అంచనాల కుదింపునకు పలు కారణాలను ఐఎంఎఫ్ పేర్కొంది.
కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
2019 వృద్ధి రేటుపై ‘కోత’ మాట...
కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
- ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలు తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. ఇక కీలకమైన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో కూడా అనిశ్చితి పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. దీనికితోడు దేశీయంగా బలహీన డిమాండ్ పరిస్థితుల ప్రభావం ఊహించినదానికన్నా ఎక్కువ.
- 2020లో వృద్ధి 7%కి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ అంచనా గతంలో 7.5 శాతంగా ఉంది.
- ఇక చైనాలో 2018లో జీడీపీ వృద్ధిరేటు 6.6 శాతం ఉంటే, 2019లో 6.1 శాతంగా ఉంటుంది. ఇది భారత్ సాధించే వృద్ధి రేటు అంచనాలకు సరిసమానం కావడం గమనార్హం. 2020లో చైనా వృద్ధిరేటు మరింత తగ్గి 5.8 శాతానికి దిగే అవకాశం ఉంది.
- ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకేసారి మందగమనంలోకి జారుతున్నాయి. ప్రపంచ ఆర్థికవృద్ధిరేటు 2019లో 3.2 శాతం, 2020లో 3.4 శాతం నమోదయ్యే అవకాశం ఉంది.
2019 వృద్ధి రేటుపై ‘కోత’ మాట...
సంస్థ | ఇప్పుడు | గతంలో |
ఆర్‌బీఐ | 6.1 | 6.9 |
ప్రపంచబ్యాంక్ | 6.0 | 7.2 |
మూడీస్ | 5.8 | 6.2 |
ఇండియా రేటింగ్స్ | 6.1 | 6.7 |
ఫిచ్ సొల్యూషన్స్ | 6.4 | 6.8 |
డీబీఎస్ | 6.2 | 6.8 |
Published date : 16 Oct 2019 05:39PM