Skip to main content

500 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్

టి20 క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్‌గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో చరిత్ర సృష్టించాడు.
Edu newsకరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నమెంట్‌లో భాగంగా ఆగస్టు 26న పోర్ట్ ఆఫ్ స్పెరుున్ వేదికగా సెరుుంట్ లూసియా జూక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న డ్వేన్ బ్రావో ఈ ఘనత అందుకున్నాడు. రఖీమ్ కార్న్‌వాల్‌ను అవుట్ చేయడం ద్వారా బ్రావో టి20 క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

2006లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టి20 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బ్రావో గత 14 ఏళ్లలో అంతర్జాతీయ, ప్రొఫెషనల్ లీగ్‌‌సతో కలిపి 459 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 501 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ 390 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

చదవండి: టెస్టుల్లో 600 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్


క్విక్ రివ్యూ :
ఏమిటి :
టి20 క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో
Published date : 29 Aug 2020 11:50AM

Photo Stories