45వేల కోట్లతో 6 జలాంతర్గాములు
Sakshi Education
అధునాతన పరిజ్ఞానంతో దేశంలో ఆరు జలాంతర్గాములను నిర్మించేందుకు భారత నౌకాదళం చర్యలు మొదలుపెట్టింది.
పి-75(ఐ) ప్రాజెక్టు కింద రూ.45వేల కోట్లతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యూహాత్మక భాగస్వాములను ఎంపిక చేసేందుకు ‘ఆసక్తి వ్యక్తీకరణ’ పత్రాలను జారీ చేసింది. కొత్తగా రూపొందించిన ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ నమూనా కింద చేపడుతున్న రెండో ప్రాజెక్టు ఇది. దీనివల్ల స్వదేశీ డిజైన్, నిర్మాణ సామర్థ్యం మెరుగుపడుతుందని నౌకాదళం పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ. 45వేల కోట్లతో 6 జలాంతర్గాముల నిర్మాణం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : భారత నౌకాదళం
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ. 45వేల కోట్లతో 6 జలాంతర్గాముల నిర్మాణం
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : భారత నౌకాదళం
Published date : 21 Jun 2019 05:30PM