Skip to main content

4,300 కిలోమీటర్ల మారథాన్‌ చేపట్టిన భారత సైనికుడు?

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఏకంగా 4,300 కిలోమీటర్లు పరిగెత్తి గిన్నిస్‌ ప్రంపంచ రికార్డుల్లోకి ఎక్కేందుకు భారత సైనికుడు నాయక్‌ వేలు పీ (30) బయలు దేరారు.
Current Affairs
60 పారా ఫీల్డ్‌ ఆస్పత్రిలో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వేలు... శ్రీనగర్‌లోని 92 బేస్‌ ఆస్పత్రి నుంచి ఏప్రిల్‌ 2న తన పరుగును ఆరంభించారు. వేలు తన లక్ష్యాన్ని 50 రోజుల్లో చేరుకోవడానికి ఆయన రోజుకు 70 నుంచి 100 కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. ‘క్లీన్‌ ఇండియా – గ్రీన్‌ ఇండియా’ సందేశాన్ని వేలు మోసుకెళ్తున్నారని ఇపీఆర్‌ఓ డిఫెన్స్‌ (జమ్మూ) లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ చెప్పారు.

వరల్డ్‌ ఛాంపియన్‌ రన్‌లో...
1991 ఏప్రిల్‌21న జన్మించిన వేలు 2011లో ఆర్మీలో చేరారు. 2012లో 12.5 కిలోమీటర్ల క్రాస్‌–కంట్రీ రన్‌కు గానూ ఆర్మీ నుంచి బంగారు పతకాన్ని అందుకున్నారు. 2016 నుంచి భారత అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2021, సెప్టెంబర్‌లో రొమేనియాలో జరగనున్న వరల్డ్‌ ఛాంపియన్‌ రన్‌లో పాల్గొననున్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 4,300 కిలోమీటర్ల మారథాన్‌ చేపట్టిన భారత సైనికుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 2
ఎవరు : నాయక్‌ వేలు పీ
ఎక్కడ : శ్రీనగర్, జమ్మూకశ్మీర్‌
ఎందుకు : క్లీన్‌ ఇండియా – గ్రీన్‌ ఇండియా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు
Published date : 05 Apr 2021 06:00PM

Photo Stories