Skip to main content

400 మీటర్ల హర్డిల్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అథ్లెట్‌?

పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో నార్వే అథ్లెట్‌ కర్‌స్టెన్‌ వార్‌హోమ్‌ నూతన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
టోక్యో ఒలింపిక్స్‌–2020లో భాగంగా ఆగస్టు 3న జరిగిన పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌ పోటీల ఫైనల్లో అతను 45.94 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో అతడు 46.70 సెకన్లతో గతంలో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును... 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కెవిన్‌ యంగ్‌ (అమెరికా; 46.78 సెకన్లు) సాధించిన ఒలింపిక్‌ రికార్డును అధిగమించాడు. 46.17 సెకన్లలో రేసును పూర్తి చేసిన రాయ్‌ బెంజమిన్‌ (అమెరికా) రజతాన్ని, అలిసన్‌ డాస్‌సాంటోస్‌ (బ్రెజిల్‌) కాంస్యాన్ని అందుకున్నారు.

‘గోల్డెన్‌’ జంప్‌
మహిళల లాంగ్‌జంప్‌లో జర్మనీ క్రీడాకారిణి మలైకా మిహాంబో స్వర్ణ పతకంతో మెరిసింది. ఆగస్టు 3న జరిగిన ఫైనల్లో ఆమె తన మూడో ప్రయత్నంలో 7 మీటర్ల దూరం గెంతి విజేతగా నిలిచింది. బ్రిట్నీ రీస్‌ (అమెరికా–6.97 మీటర్లు) రజతం, ఈసె బ్రుమె (నైజీరియా; 6.97 మీటర్లు) కాంస్యం సాధించారు. బ్రిట్నీ, ఈసె బ్రుమై 6.97 మీటర్ల దూరం గెంతినా... బ్రుమై రెండు ఫౌల్స్‌ చేసినందుకు కాంస్యంతో సరిపెట్టుకుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అథ్లెట్‌?
ఎప్పుడు : ఆగస్టు 3, 2021
ఎవరు : నార్వే అథ్లెట్‌ కర్‌స్టెన్‌ వార్‌హోమ్‌
ఎక్కడ : టోక్యో, జపాన్‌
ఎందుకు : టోక్యో ఒలింపిక్స్‌–2020 పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో 45.94 సెకన్లలో గమ్యాన్ని చేరినందున...
Published date : 04 Aug 2021 05:46PM

Photo Stories