36వ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఎక్కడ జరగుతోంది?
Sakshi Education
36వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2021ను అస్సాంలోని గువాహటిలో నిర్వహిస్తున్నారు.
ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ చాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6న మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన అగసారా నందిని అండర్-18 బాలికల లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని అయిన నందిని లాంగ్‌జంప్ ఫైనల్లో 5.80 మీటర్ల దూరం దూకి పసిడి పతకాన్ని దక్కించుకుంది.
లక్ష్మీకి రజత పతకం...
అండర్-18 బాలికల లాంగ్‌జంప్‌లోనే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన జెమ్మెల లక్ష్మీ రజత పతకం దక్కించుకుంది. అండర్-20 బాలుర షాట్‌పుట్ ఈవెంట్‌లో తెలంగాణకి చెందిన మొహమ్మద్ మోసిన్ ఖురేషీ కాంస్య పతకం సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 36వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2021 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : గువాహటి, అస్సాం

Published date : 08 Feb 2021 06:19PM