300 కోట్ల ఏళ్లకు పూర్వం భూమి జలమయం
Sakshi Education
దాదాపు 300 కోట్ల సంవత్సరాల కింద భూమి పూర్తిగా నీటితో కప్పి ఉండేదని ఓ తాజా అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనం ద్వారా భూమిపై ఏక కణజీవులు ఎక్కడ, ఎలా పరిణామం చెందాయో పరిశోధకులు తెలుసుకునే వీలుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘నేచర్ జియోసైన్స్ జర్నల్’లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. పురాతన భూగోళం ఎలా ఉండేదన్న చర్చలకు ఈ అధ్యయనం ద్వారా సమాధానం దొరికినట్లయిందని అమెరికాలోని కొలరాడో వర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ బోస్‌వెల్ వివరించారు. ఆస్ట్రేలియాలోని పనోరమా జిల్లాలో ఉన్న కొండలు, పర్వతాలు ఒకప్పుడు నదీ ప్రవాహాల కారణంగా ఏర్పడి ఉంటాయని అయోవా స్టేట్ వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాన్సన్ తెలిపారు.
Published date : 04 Mar 2020 05:40PM