30 వేల ప్రపంచ మ్యాప్‌లు ధ్వంసం
Sakshi Education
చైనాలోని క్వింగ్‌డావో పట్టణంలో ఒక సంస్థ తయారుచేసిన 30 వేల ప్రపంచ మ్యాప్‌లను మార్చి 26న చైనా ధ్వంసం చేసింది.
తమ దేశ భూభాగానికి వ్యతిరేకంగా ఈ మ్యాప్‌లను తయారు చేసినందుకే వీటిని ధ్వంసం చేసినట్లు చైనా వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగంగా, తైవాన్‌ను ప్రత్యేక దేశంగా ఈ మ్యాప్‌లలో చూపించారని పేర్కొంది.
భారత ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా దక్షిణ టిబెట్‌లో భాగంగా చెప్పుకుంటుంది. అయితే భారత్ ఈ వాదనను ఖండిస్తోంది. భారత భూభాగంలో అరుణాచల్ ప్రదేశ్ భాగమనీ, అక్కడకు భారతీయులెవరైనా ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా వెళ్లొచ్చని స్పష్టం చేస్తోంది. ద్వీప దేశం తైవాన్ కూడా తమదేనని చైనా అంటోంది. ఈ వాదనను తైవాన్ తిప్పికొడూతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 30 వేల ప్రపంచ మ్యాప్‌లు ధ్వంసం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : చైనా
ఎక్కడ : క్వింగ్‌డావో, చైనా
ఎందుకు : తమ దేశ భూభాగానికి వ్యతిరేకంగా ఈ మ్యాప్‌లను తయారు చేశారని

Published date : 27 Mar 2019 04:58PM