30 ఏళ్ల కనిష్టానికి భారత్ వృద్ధి రేటు: ఫిచ్
ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. 2020–21లో వృద్ధి రేటు కేవలం 2 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. గత అంచనాలైన 5.6 శాతాన్ని ఇటీవల మార్చిలో 5.1 శాతానికి కుదించిన ఫిచ్ .. తాజాగా 2 శాతానికి తగ్గించింది. లాక్‌డౌన్‌లతో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం ప్రభావాలు భారత్‌పైనా గణనీయంగా ఉండబోతున్నాయని ఏప్రిల్ 3న వివరించింది.
3.6శాతమే: ఇండియా రేటింగ్స్
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ ఇటీవలే 2020లో భారత వృద్ధి రేటు అంచనాలను 5.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించేసిన సంగతి తెలిసిందే. అటు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ 3.5 శాతానికి, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ 3.6 శాతానికి కుదించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 30 ఏళ్ల కనిష్టానికి భారత్ వృద్ధి రేటు
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
ఎందుకు : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా