Skip to main content

2జీ రహిత భారత్‌: ముకేశ్ అంబానీ

ఎప్పుడో పాతికేళ్ల క్రితం ప్రారంభించిన 2జీ టెలిఫోనీ సర్వీసులను ఇక నిలిపివేయాల్సిన సమయం వచ్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వ్యాఖ్యానించారు.
Current Affairs ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా తొలి మొబైల్‌ ఫోన్‌ కాల్‌ చేసి పాతికేళ్లయిన (సిల్వర్‌ జూబ్లీ) సందర్భంగా జూలై 31 నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డేటా వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నందున.. కనెక్టివిటీని మెరుగుపర్చడంపై టెలికం పరిశ్రమ దృష్టి పెట్టాలని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌ సూచించారు.

ఫారెక్స్‌ నిల్వల రికార్డు...
ముంబై: భారత్‌ విదేశీ మారకపు నిల్వలు తాజాగా జూలై 24వ తేదీతో ముగిసిన వారంలో అంతకుముందు వారం (జూలై 17వ తేదీతో ముగిసిన)తో పోల్చి 5 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తంగా 522.63 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పసిడి నిల్వల విలువలు పెరగడం, దిగుమతులు అంతగా లేకపోవడంతో తగ్గిన విదేశీ మారక వినియోగం వంటి అంశాలు ఫారెక్స్‌ రికార్డులకు కారణం.
Published date : 02 Aug 2020 10:44AM

Photo Stories