Skip to main content

29 కోట్ల మంది పిల్లలు బడికి దూరం: యునెస్కో

కోవిడ్ -19 (కరోనా వైరస్) ప్రభావంతో మొత్తంగా 13 దేశ్లాలో 29 కోట్ల మంది పిల్లలు బడికి దూరమయ్యారని యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజషన్ (యునెస్కో) మార్చి 6న వెల్లడించింది.
Current Affairsపిల్లలకి వైరస్ సోకకుండా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో కోట్లాదిమంది చదువులపై ప్రభావం చూపించిందని తెలిపింది. ఆరోగ్యపరంగా ఇలా బడికి సెలవులు ఇవ్వడం సాధారణమే అయినా ఎక్కువ కాలం కొనసాగితే విద్యాహక్కుకి భంగం వాటిల్లుతుందని యునెస్కో డెరైక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే అన్నారు.

పకడ్బందీ చర్యలు అవసరం: డబ్ల్యూహెచ్‌వో
కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇంచుమించుగా లక్షకి చేరుకుంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు కరోనా కట్టడికి మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్ మార్చి 6న హెచ్చరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
13 దేశ్లాలో 29 కోట్ల మంది పిల్లలు బడికి దూరం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజషన్ (యునెస్కో)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా ఎందుకు : కోవిడ్ -19 (కరోనా వైరస్) ప్రభావంతో
Published date : 07 Mar 2020 05:56PM

Photo Stories