28 చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు
Sakshi Education
చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో ఉయిఘర్ ముస్లిం మైనారిటీలపై చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని అమెరికా తెలిపింది.
ఈ విషయంలో చైనాకు మద్దతుగా నిలిచిన 28 చైనా కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా వాణిజ్య విభాగం అక్టోబర్ 7న ప్రకటించింది. ఈ కంపెనీలను నిషేధిత జాబితాలో చేర్చినట్లు పేర్కొంది. దీంతో ఈ 28 కంపెనీలు ఎగుమతులు, దిగుమతులు, సాంకేతికత మార్పిడికి సంబంధించి కొత్త అనుమతులు లేదా అదనపు లెసైన్స్ లు పొందాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు కల్పించిన రాయితీలను సైతం ఎత్తివేసే అవకాశం ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 28 చైనా కంపెనీలపై ఆంక్షలు
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : అమెరికా
ఎందుకు : మానవ హక్కుల ఉల్లంఘనకు మద్దతుగా నిలిచినందున
క్విక్ రివ్యూ :
ఏమిటి : 28 చైనా కంపెనీలపై ఆంక్షలు
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : అమెరికా
ఎందుకు : మానవ హక్కుల ఉల్లంఘనకు మద్దతుగా నిలిచినందున
Published date : 11 Oct 2019 04:58PM