2021 ఏడాది జీ-7 దేశాల సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి?
Sakshi Education
బ్రిటన్ అధ్యక్షతన 2021, జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న జీ 7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) దేశాల శిఖరాగ్ర సమావేశాలకు యూకేలోని తీర ప్రాంతం ‘‘కార్న్‌వాల్’’ వేదిక కానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాది జీ-7 దేశాల సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : బ్రిటన్
ఎక్కడ : కార్న్‌వాల్ ప్రాంతం, యూకే
ఎందుకు : సమకాలీన, ఆర్థిక అంశాలపై చర్చలు జరిపేందుకు
ఈ శిఖరాగ్ర భేటీకి భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలను ఆతిథ్య హోదాలో ఆహ్వానించారు. జీ-7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జనవరి 17న వెల్లడించారు. బోరిస్ తెలిపిన వివరాల ప్రకారం...
- 2021 ఏడాది జీ7 భేటీకి హాజరయ్యే 10 మంది నేతలు ప్రపంచంలోని ప్రజాస్వామ్యదేశాల్లోని 60 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
- తగరం, రాగి గనులతో 200 ఏళ్ల క్రితం బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవానికి కీలకంగా నిలిచిన కార్న్‌వాల్‌లో జీ7 భేటీ జరుగుతుంది.
జీ-7 సభ్య దేశాలు...
- అమెరికా
- యూకే
- కెనడా
- ఫ్రాన్స్
- జర్మనీ
- ఇటలీ
- జపాన్
మరిన్ని అంశాలు...
- యూకే 2021 ఏడాది ఫిబ్రవరిలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.
- భారత్ త్వరలో బ్రిక్స్ అధ్యక్ష హోదాతోపాటు, 2023లో జీ20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాది జీ-7 దేశాల సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : బ్రిటన్
ఎక్కడ : కార్న్‌వాల్ ప్రాంతం, యూకే
ఎందుకు : సమకాలీన, ఆర్థిక అంశాలపై చర్చలు జరిపేందుకు
Published date : 20 Jan 2021 01:38PM