2021 ఏడాది భారత గణంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేత?
Sakshi Education
2021 ఏడాది భారత గణంత్ర వేడుకలకు హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీ పంపిన ఆహ్వానాన్ని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అంగీకరించారు.
2021, జనవరి 26న జరిగే భారత గణతంత్ర వేడుకలకు ప్రధాని జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ డిసెంబర్ 15న వెల్లడించారు. ఈ పర్యటన భారత్, బ్రిటన్‌ల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు బ్రిటన్‌లో జరిగే జీ7 సమ్మిట్‌కి సౌత్ కొరియా, ఆస్ట్రేలియాతో సహా భారత్‌ని ఆహ్వనిస్తూ ప్రధాని మోదీకి జాన్సన్ లేఖ రాశారు.
చదవండి: 2020 ఏడాది భారత గణంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాది భారత గణంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేత?
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్
ఎక్కడ : భారత్
ఎందుకు : భారత్ ఆహ్వానం మేరకు
Published date : 16 Dec 2020 05:45PM