2020లో భారత్ వృద్ధి 5.3 శాతమే: మూడీస్
Sakshi Education
భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 2020లో 5.3 శాతమే నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ.. మూడీస్ అంచనావేసింది.
ఈ మేరకు 2020, ఫిబ్రవరిలో వేసిన 5.4 శాతం అంచనాలను 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర కుదించింది. అంచనాల కుదింపునకు కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావమే కారణమని మార్చి 17న వెల్లడించింది. 2021లో భారత వృద్ధి రేటు కాస్త పుంజుకుని 5.8 శాతంగా నమోదు కావచ్చని పేర్కొంది.
2020 భారత్ వృద్ధి అంచనాలను మూడీస్ తగ్గించడం ఇది వరుసగా రెండవసారి. తొలుత 6.6 శాతం అంచనాలను ఫిబ్రవరిలో 5.4 శాతానికి కుదించడం జరిగింది. తాజాగా దీనిని 5.3 శాతానికి తగ్గించింది. 2018లో భారత జీడీపీ రేటు 7.4 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020లో భారత్ వృద్ధి 5.3 శాతమే
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ.. మూడీస్
ఎందుకు : కోవిడ్-19(కరోనా వైరస్) కారణంగా

Published date : 18 Mar 2020 06:18PM