Skip to main content

2020 ఏడాదిలోనే టీ హబ్ 2 : మంత్రి కేటీఆర్

2020 సంవత్సరంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ 2, దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టీ-వర్క్స్‌ని ప్రారంభించనున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు.
Current Affairsహైదరాబాద్‌లో జనవరి 6న జరిగిన టీ హబ్ నాలుగో వార్షికోత్సవ సంబరాల్లో మంత్రి ఈ మేరకు తెలిపారు. టెక్నాలజీ రంగంలో 2020 తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం కలిగిన సంవత్సరమని ఆయన పేర్కొన్నారు. ఇన్నోవేషన్ ద్వారా అనేక సవాళ్లకు సమాధానాలు లభిస్తాయని, తెలంగాణ స్టార్టప్ కంపెనీలు ఈ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

మాదిరి ప్రశ్నలు
Published date : 07 Jan 2020 05:42PM

Photo Stories