2020 ఏడాదిలో అత్యంత ప్రభావం చూపించిన భారతీయలు?
Sakshi Education
2020 ఏడాదికి గాను టైమ్ మ్యాగజైన్ రూపొందించిన ‘అత్యంత ప్రభావితం చూపించిన వ్యక్తులు-100’ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఐదుగురు భారతీయులు స్థానం సంపాదించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ఆందోళనలను ముందుండి నడిపించిన 82 ఏళ్ల బిల్కిస్ ఈ జాబితాలో స్థానం పొందారు. అలాగే బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
టైమ్స్ జాబితా రాజకీయ నాయకుల కేటగిరీలో మోదీతో పాటుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇండియన్ అమెరికన్ కమలా హ్యారిస్ ఉన్నారు. భారత్‌ని ముందుకు నడిపించే నాయకుడు మోదీని మించి మరొకరు లేరని టైమ్ పత్రిక పేర్కొంది. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రవీంద్ర గుప్తా హెచ్‌ఐవీ ఎయిడ్‌స వ్యాధిని జయించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆర్టిస్టుల కేటగిరిలో స్థానం దక్కించుకున్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి టైమ్ ప్రొఫైల్‌లో నటి దీపికా పదుకొనె రాశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్స్ జాబితా ప్రకారం... 2020 ఏడాదిలో అత్యంత ప్రభావం చూపించిన భారతీయలు
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : నరేంద్ర మోదీ, బిల్కిస్ దాదీ, ఆయుష్మాన్ ఖురానా, సుందర్ పిచాయ్, రవీంద్ర గుప్తా

Published date : 24 Sep 2020 05:05PM