2020 ఏడాదికి కౌశలాచార్య అవార్డును కేంద్రం ఏ సంస్థకు ప్రదానం చేసింది?
Sakshi Education
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘కౌశలాచార్య’ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ)కు ప్రదానం చేసింది.
ఉపాధి-శిక్షణ అనే అంశంలో విశేష కృషి చేసినందుకు గాను ఏపీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ‘కౌశలాచార్య’ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రం, మెమెంటోను అందిస్తారు.
ప్రొఫెసర్ సతీష్‌ధవన్ పుస్తకావిష్కరణ
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అక్టోబర్ 5న బెంగళూరులోని అంతరిక్ష ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ సతీష్ ధవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ సతీష్ ధవన్‌పై ప్రచురించిన ‘ఇన్ గ్లోరియస్ మెమొరీ ఆఫ్ ప్రొఫెసర్ సతీష్‌ధవన్’ అనే పుస్తకాన్ని శివన్ ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కౌశలాచార్య’ అవార్డు-2020 విజేత
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ)
ఎందుకు : ఉపాధి-శిక్షణ అనే అంశంలో విశేష కృషి చేసినందుకుగాను

Published date : 07 Oct 2020 05:32PM