2020–21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు ఎంతశాతం?
Sakshi Education
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం... ద్రవ్యలోటు2020–21 ఆర్థిక సంవత్సరం రూ.18,21,461 కోట్లుగా నమోదయ్యింది.
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే ఇది 9.3 శాతం. ఆర్థిక శాఖ సవరిత అంచనాలు 9.5 శాతం కన్నా ఇది తక్కువ. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) మే 31న తాజా గణాంకాలను విడుదల చేసింది. మరిన్ని అంశాలను పరిశీలిస్తే, 2020–21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటుజీడీపీలో3.5 శాతం ఉండాలని (రూ.7.96 లక్షల కోట్లు) 2020 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. అయితే కరోనా కష్టాల నేపథ్యంలో ఆదాయాలు భారీగా పడిపోయాయి. దీనితోద్రవ్యలోటు అంచనాలను 9.5 శాతానికి (రూ.18,48,655 కోట్లు) పెంచుతున్నట్లు 2021–22 బడ్జెట్ పేర్కొం ది. సవరిత అంచనాలకన్నా 20బేసిస్ పాయింట్లు తక్కువగా 9.3 శాతంగా ద్రవ్యలోటు తాజాగా నమోదయ్యింది.
|
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020–21 ఆర్థిక సంవత్సరంలో9.3 శాతం ద్రవ్యలోటు నమోదు
ఎప్పుడు : మే 31
ఎవరు : కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)
ఎందుకు :కరోనా కష్టాల నేపథ్యంలో ఆదాయాలు భారీగా పడిపోవడంతో...
|
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020–21 ఆర్థిక సంవత్సరంలో9.3 శాతం ద్రవ్యలోటు నమోదు
ఎప్పుడు : మే 31
ఎవరు : కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)
ఎందుకు :కరోనా కష్టాల నేపథ్యంలో ఆదాయాలు భారీగా పడిపోవడంతో...
Published date : 02 Jun 2021 06:09PM