2019 పెట్రోటెక్ సదస్సు ప్రారంభం
Sakshi Education
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో అంతర్జాతీయ ఆయిల్ అండ్ గ్యాస్ సదస్సు- పెట్రోటెక్ 2019ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 11న ప్రారంభించారు.
మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో భాగస్వామ్య దేశాల నుంచి 95 మందికి పైగా ఇంధన శాఖ మంత్రులు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన 7,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.ఈ సదస్సులో ప్రధాని ప్రసంగిస్తూ... 2030 నాటికి దేశం ప్రపంచంలోనే రెండవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని అన్నారు.
అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ..
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ (ముడి చమురు శుద్ధి)సామర్థ్యాన్ని సముపార్జించుకుంది. ప్రస్తుతం 230 ఎంఎంటీపీఏ (వార్షికంగా... మిలియన్ మెట్రిక్ టన్నులు)గా ఉన్న సామర్థ్యం 2030 నాటికి మరో 200 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019 పెట్రోటెక్ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్

Published date : 12 Feb 2019 04:56PM