Skip to main content

2019–20లో అత్యధికంగా విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీ?

ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు 2019–20లో వచ్చిన విరాళాల వివరాలను అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫారమ్స్‌ (ఏడీఆర్‌) జూన్‌ 23న వెల్లడించింది.
Current Affairs

ఏడీఆర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... మొత్తం ఏడు ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ల నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అత్యధికంగా రూ. 276.45 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇది మొత్తం విరాళాల్లో 76.17 శాతం. బీజేపీ తరువాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు 15.98 శాతం (రూ. 58 కోట్లు) విరాళాలు మాత్రమే వచ్చాయి. విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతీ సంవత్సరం నివేదిక రూపంలో తమకు అందించాలని ఎన్నికల సంఘం ఎలక్టోరల్‌ ట్రస్ట్‌లను ఆదేశించిన విషయం తెలిసిందే.


ఏడీఆర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం...
  • ఆప్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, యువ జనజాగృతి పార్టీ, జననాయక పార్టీ, జేడీయూ, జేఎంఎం, ఎల్జేపీ, శిరోమణి అకాలీదళ్, జేకేఎన్‌సీ, ఐఎన్‌ఎల్‌డీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు కలిసి రూ. 25.46 కోట్లు అందుకున్నాయి.
  • అత్యధికంగా విరాళాల ఇచ్చిన సంస్థల్లో జేఎస్‌డబ్ల్యూ, అపోలో టైర్స్, ఇండియాబుల్స్, ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, డీఎల్‌ఎఫ్‌ గ్రూప్‌ తొలి ఐదుస్థానాల్లో ఉన్నాయి.
  • జేఎస్‌డబ్ల్యూ అత్యధికంగా రూ. 39.10 కోట్లను ఇవ్వగా, అపోలో టైర్స్‌ రూ. 30 కోట్లను, ఇండియాబుల్స్‌ రూ. 25 కోట్లను విరాళంగా ఇచ్చాయి.
  • 18 మంది వ్యక్తులు కూడా వ్యక్తిగత విరాళాలను ఈ ట్రస్ట్‌లకు అందించారు. వారిలో 10 మంది ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు మొత్తం రూ. 2.87 కోట్లను అందించారు.
  • స్మాల్‌ డొనేషన్స్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు ఐదుగురు వ్యక్తులు రూ. 5.5 లక్షలు ఇచ్చారు. మరో నలుగురు స్వదేశీ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు రూ. 1 లక్ష ఇచ్చారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
2019–20లో అత్యధికంగా విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీ?
ఎప్పుడు : జూన్‌ 23
ఎవరు : భారతీయ జనతా పార్టీ (బీజేపీ)
ఎక్కడ : దేశంలో...
ఎందుకు : అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫారమ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించిన వివరాల ప్రకారం...
Published date : 24 Jun 2021 06:09PM

Photo Stories