Skip to main content

2019 – 20 రబీ సున్నా వడ్డీ రాయితీ చెల్లింపు

ౖవైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద <b>2019 – 20 రబీ సున్నా వడ్డీ రాయితీని </b>ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 20న తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు.
Current Affairs అర్హులైన 6,27,906 మంది రైతుల ఖాతాల్లో రూ.128.47 కోట్లను జమ చేశారు. లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులకు ప్రభుత్వం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని వర్తింపచేస్తోంది.

కరోనా టీకా సంస్థలకు అడ్వాన్స్‌...
దేశంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్ల సరఫరాను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ), భారత్‌ బయోటెక్‌ తదితర టీకాల తయారీ సంస్థలకు భవిష్యత్‌లో సరఫరా చేయబోయే వ్యాక్సిన్లకు సంబంధించి రూ. 4,500 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఎస్‌ఐఐకి రూ. 3,000 కోట్లు, భారత్‌ బయోటెక్‌కు సుమారు రూ. 1,500 కోట్లు లభిస్తాయి. క్రెడిట్‌ లైన్‌ రూపంలో ఇచ్చే ఈ నిధులకు కేబినెట్‌ ఆమోదం అవసరం లేదు. ఆర్థిక మంత్రి ఆమోదం ఉంటే సరిపోతుంది.
Published date : 21 Apr 2021 07:19PM

Photo Stories