Skip to main content

2017 నాటికి ఏటా కరిగే మంచు ఎన్ని లక్షల టన్నులకు చేరింది?

భూమిపై ఉన్న మంచు కరిగే వేగం నానాటికీ పెరిగిపోతోందని, 1994- 2017 మధ్య 28లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Current Affairs గత మూడు దశాబ్దాలతో పోలిస్తే భూమిపై ఉన్న మంచు కరిగే వేగం పెరిగిందని సర్వేలో వెల్లడైంది. సర్వేలో 2.15లక్షల గ్లేసియర్లను అధ్యయనం చేశారు. ఈ అధ్యయన వివరాలను ది క్రయోస్ఫియర్ జర్నల్ ప్రచురించింది. శాటిలైట్ డేటా ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు.

ముఖ్యాంశాలు...
  • 1990ల్లో ఏటా 0.8 లక్ష కోట్ల టన్నుల మేర మంచు కరిగేది, 2017 నాటికి ఏటా కరిగే మంచు 1.3 లక్షల టన్నులకు చేరింది.
  • 23 సంవత్సరాల్లో పరిశీలిస్తే మంచు కరిగే వేగం 65 శాతం పెరిగింది.
  • అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌లో ఐస్ షీట్లు కరిగిపోవడంతో మంచు కరిగే రేటు పెరిగింది.
Published date : 26 Jan 2021 07:54PM

Photo Stories