Skip to main content

2–డీజీ యాంటీ–కోవిడ్‌ డ్రగ్‌ను అభివృద్ది చేసిన సంస్థలు?

కోవిడ్‌–19 చికిత్సలో వాడే... 2–డియోక్సీ–డి–గ్లూకోజ్‌ (2–డీజీ) ఔషధం తయారీ, విక్రయానికి డీఆర్‌డీవో నుంచి ఫార్మా కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ లైసెన్స్‌ దక్కించుకుంది.
Current Affairs

2–డీజీ అత్యవసర వినియోగానికి అనుమతికై సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌కు తాము దరఖాస్తు చేసినట్లు కంపెనీ తెలిపింది. 2–డీజీ యాంటీ–కోవిడ్‌ ఔషధాన్ని హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌తో కలిసి డీఆర్‌డీఓకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలాయిడ్‌ సైన్సెస్‌ (ఇన్‌మాస్‌) సంయుక్తంగా అభివృద్ధి చేసింది. కరోనాబారినపడి ఆసుపత్రుల్లో చేరిన బాధితులు త్వరగా కోలుకోవడానికి, ఆక్సిజన్‌పై ఆధారపడడాన్ని తగ్గించడానికి 2డీజీ యాంటీ–కోవిడ్‌ డ్రగ్‌ ఉపయోగపడుతుంది.

Published date : 03 Jul 2021 06:05PM

Photo Stories