17 దేశాలకు విస్తరించిన భారత్ డబుల్ మ్యూటెంట్
Sakshi Education
భారత్‌లో రెండు సార్లు జన్యుమార్పిడికి లోనైనా కరోనా వైరస్ 17 దేశాలకు వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఈ వైరస్‌ను బి.1.617 భారత్ రకం అని పిలుస్తున్నారు. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్‌తోనే భారత్‌లో కేసులు భారీగా పెరిగిపోయాయి.ఏప్రిల్ 27 నాటికి భారత్ వైరస్ రకం కేసులు 17 దేశాల్లో బయటపడ్డాయని డబ్ల్యూహెచ్‌ఒ వెల్లడించింది. ఈ రకం వైరస్ కేసులో ఎక్కువగా భారత్, బ్రిటన్, అమెరికా, సింగపూర్ నుంచి వస్తున్నాయి. వైరస్‌లకు సంబంధించిన జన్యు మార్పులపై డేటాను సేకరించి భద్రపరిచే జిశాడ్ సంస్థ ఈ వివరాలు అందించినట్టుగాడబ్ల్యూహెచ్‌ఒ పేర్కొంది.
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ దేశంలోని డబుల్ మ్యూటెంట్ ‘‘బి.1.617’’ రకం కరోనా వైరస్ ను సమర్థంగా అడ్డుకుంటోందని అమెరికాలోని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వయిజరీ ఆఫీసర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు.

Published date : 29 Apr 2021 06:08PM