Skip to main content

16వ లోక్‌సభను రద్దుకు కేంద్ర కేబినెట్ సిఫారసు

16వ లోక్‌సభ రద్దుకు కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది.
ఈ మేరకు మే 24న ప్రధాని నరేంద్ర మోదీ, మిగతా కేంద్రమంత్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలసి రాజీనామాలు సమర్పించారు. వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగాల్సిందిగా ప్రధానిని కోరారు. 2019, జూన్ 3వ తేదీలోగా 17వ లోక్‌సభ కొలువుదీరాల్సి ఉంది. ముగ్గురు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతిని కలసి కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను అందజేయడంతో కొత్త సభ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
16వ లోక్‌సభను రద్దుకు కేంద్ర కేబినెట్ సిఫారసు
ఎప్పుడు : మే 24
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 25 May 2019 06:12PM

Photo Stories