Skip to main content

16ఏళ్ల బాలుడికి శౌర్యచక్ర ప్రదానం

ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడిన 16ఏళ్ల బాలుడు ఇర్ఫాన్ రంజాన్ షేక్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 19న ఢిల్లీలో శౌర్యచక్ర పతకాన్ని ప్రదానం చేశారు.
చిన్నవయసులోనే అతడు చూపిన అసమాన ధైర్యసాహసాలకుగాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2017 అక్టోబరు 16న కశ్మీర్‌లోని ఇర్ఫాన్ ఇంటిని ముగ్గురు ఉగ్రవాదులు చుట్టుముట్టారు. మాజీ గ్రామ సర్పంచ్ అయిన తండ్రితోపాటు ఇతర కుటుంబ సభ్యులను కాపాడుకొనేందుకు ఇర్ఫాన్ వారితో పోరాడాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇర్ఫాన్ రంజాన్ షేక్‌కు శౌర్యచక్ర ప్రదానం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అసమాన ధైర్యసాహసాలకుగాను
Published date : 20 Mar 2019 05:14PM

Photo Stories