15వ ఫైనాన్స్ కమిషన్ నివేదికను ఏ శీర్షికతో రూపొందించారు?
Sakshi Education
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నవంబర్ 16వ తేదీన న్యూఢిల్లీలో 15వ ఫైనాన్స్ కమిషన్ తన నివేదికను సమర్పించింది.
15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్, సభ్యులు అజయ్ నారాయన్ ఝా, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేశ్ చంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నివేదిక ద్వారా రానున్న ఐదు సంవత్సరాల్లో (2021-22 నుంచి 2025-26) కేంద్రం-రాష్ట్రాల మధ్య పన్ను విభజన సహా పలు ఫైనాన్షియల్ సంబంధాలపై 15వ ఫైనాన్స్ కమిషన్ తన సిఫారసులను చేసింది. ‘ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్’ శీర్షికన రూపొందించిన ఈ నివేదికను నవంబర్ 17న కమిషన్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా సమర్పించనుంది. నవంబర్ 9న కమిషన్ తన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రకారం, చర్యల నివేదికతో పాటు కమిషన్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్ శీర్షికన రూపొందించిన నివేదిక ప్రధాని మోదీకి అందజేత
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : 15వ ఫైనాన్స్ కమిషన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : రానున్న ఐదు సంవత్సరాల్లో (2021-22 నుంచి 2025-26) కేంద్రం-రాష్ట్రాల మధ్య పన్ను విభజన సహా పలు ఫైనాన్షియల్ సంబంధాలపై సిఫార్సులు చేసేందుకు

Published date : 17 Nov 2020 05:16PM