15వ ఆర్థిక సంఘం చైర్మన్‌తో ఏపీ సీఎం సమావేశం
Sakshi Education
15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్, కార్యదర్శి అరవింద్ మెహతా, సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధికారులు సమావేశమయ్యారు.
అమరావతిలో డిసెంబర్ 19న జరిగిన ఈ భేటీలో ఆర్థిక సంఘానికి సీఎం జగన్ రాష్ట్ర పరిస్థితిని వివరించారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, సేవ, ఆరోగ్య, విద్యా, మౌలిక రంగాలపై అధికారులు సమగ్ర వివరాలు అందించారు. విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం అన్ని రంగాల్లో కోలుకోవాలంటే ఉదారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు అందేలా సిఫార్సులు చేయాలని కోరారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్‌తో సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్

Published date : 20 Dec 2019 05:56PM