Skip to main content

107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం

బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జనవరి 3న 107వ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Current Affairsజనవరి 7 వరకు జరగనున్న ఈ కాంగ్రెస్‌ను ‘సైన్స్, టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి’ని అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. సదస్సుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎస్.రాజేంద్ర ప్రసాద్, సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.ఎస్.రంగప్ప, వివిధ దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు హాజరయ్యారు.

సైన్స్ కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగిస్తూ... ‘సృజనాత్మక ఉత్పత్తులను రూపొందించడం, వాటికి పేటెంట్ సాధించడం, పరిశ్రమ స్థాయిలో వాటిని ఉత్పత్తి చేయడం, అభివృద్ధి సాధించడం (ఇన్నోవేట్, పేటెంట్, ప్రొడ్యూస్, ప్రాస్పర్)’ అనే నాలుగు మార్గాలు దేశ పురోగతిని శీఘ్రతరం చేస్తాయని’ యువ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు.

ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
  • శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించే పురోగతి పైననే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది.
  • ప్రపంచ సృజనాత్మక సూచీలో భారత్ స్థానం 52కి చేరింది.
  • ప్లాస్టిక్‌కు చవకైన, పర్యావరణహిత ప్రత్యామ్నాయాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.
  • 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందేందుకు పరిశ్రమల అవసరాలకు తగ్గ పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది.
  • మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్ల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన లోహాలను సమర్థంగా, చౌకగా వెలికితీయగల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్ణాటక

మాదిరి ప్రశ్నలు
Published date : 04 Jan 2020 05:55PM

Photo Stories