Skip to main content

1075 హెల్ప్‌లైన్‌ నంబర్ ఏ శాఖకు చెందినది?

కోవిడ్‌ సంక్షోభకాలంలో ఎంతగానో సాయపడే ఆరు జాతీయ హెల్ప్‌ లైన్‌ నంబర్లపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని దేశంలోని అన్ని ప్రైవేట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెళ్లను జూన్ 3న కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశించింది.
Current Affairs
వీటిలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన 1075 హెల్ప్‌లైన్‌ నంబర్, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన 1098 నంబర్, జాతీయ మానసిక ఆరోగ్య సపోర్టు 08046110007 నంబర్, ఆయుష్‌కోవిడ్‌ కౌన్సెలింగ్‌ నంబర్‌ 14443, మైగవర్నమెంట్‌ వాట్సాప్‌ హెల్ప్‌ డెస్క్‌ నంబర్‌ 9013151515, సీనియర్‌ సిటిజన్ల సామాజిక న్యాయ శాఖ నంబర్‌ 14567 ఉన్నాయి.ఆయా చానళ్లలో కార్యక్రమాల మధ్యలో వచ్చే విరామ సమయాల్లో ఈ హెల్ప్‌లైన్‌ నంబర్లను చూపించాలని సూచించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జాతీయ హెల్ప్‌ లైన్‌ నంబర్లపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని ప్రైవేట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెల్లకు ఆదేశాలు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు :కోవిడ్‌ కు సంబంధించి ప్రజలకు సమాచారం అందించేందుకు...
Published date : 05 Jun 2021 01:13PM

Photo Stories