10 లక్షల మంది భారతీయులు వెనక్కి
Sakshi Education
వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన వందేభారత్ మిషన్ లో భాగంగా దాదాపు 10 లక్షల మందిని భారత్‌కు తిరిగితెచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఆగస్టు 11న ప్రకటించింది.
కరోనా సంక్షోభ నేపథ్యంలో ప్రవాస భారతీయుల కోసం ఈ మిషన్ ను మే 7న ఆరంభించారు. ఇదే సమయంలో భారత్ నుంచి దాదాపు 1.3 లక్షల మంది వివిధ దేశాలకు విమానాల ద్వారా వెనక్కు వెళ్లారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. ప్రస్తుతం వందేభారత్ మిషన్ లో 5వ దశ నడుస్తోంది. ఇందులో దాదాపు 1.3 లక్షల భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.400 కోట్లతో సచివాలయం నిర్మాణం
కొత్త సచివాలయం భవన సముదాయం నిర్మాణానికి రూ.400 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు జారీచేసింది. చెన్నైకు చెందిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ రూపకల్పన చేసిన కొత్త సచివాలయం భవన డిజైన్‌ను ఆమోదించడంతో పాటు కొత్త సచివాలయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయం నిర్మాణానికి పరిపాలనా అనుమతులను సాధారణ పరిపాలన శాఖ జారీచేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విదేశాల నుంచి 10 లక్షల మంది భారతీయులు వెనక్కి
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : భారత విదేశీ వ్యవహారాల శాఖ
ఎందుకు:వందేభారత్ మిషన్ లో భాగంగా

Published date : 12 Aug 2020 05:50PM