Skip to main content

10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌కు రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ నవంబర్ 28న మరో రికార్డ్ ఘనత సాధించింది.
Current Affairsఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.10,01,555 కోట్లను తాకింది. దీంతో ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,584ను తాకిన రిలయన్స్ షేర్ చివరకు 0.6 శాతం లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,01,555 కోట్లకు చేరింది. ఫలితంగా ఈ కంపెనీ ప్రమోటర్ ముకేశ్ అంబానీ సంపద రూ.4,28,973 కోట్లకు చేరింది.

ఒక్క రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్.. 19 నిఫ్టీ కంపెనీల మార్కెట్ క్యాప్‌కు, మొత్తం నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీలోని 250 కంపెనీల మార్కెట్ క్యాప్‌కు సమానం. కంపెనీ షేర్ ధరను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాప్‌గా వ్యవహరిస్తారు.

రిలయన్స్ మార్కెట్ క్యాప్ జర్నీ ఇలా...

తేదీ

షేర్ ధర (రూ. లలో)

మార్కెట్ క్యాప్ (రూ.కోట్లలో)

2/08/2005

94

1,03,321

16/04/2007

364

2,03,138

19/09/2007

543

3,02,935

29/10/2007

707

4,11,078

21/07/2017

793

5,15,400

01/11/2017

953

6,03,207

19/07/2018

1,105

7,00,089

23/08/2018

1,270

8,04,533

24/10/2019

1,437

9,10,587

28/11/2019

1,580

10,01,555

క్విక్ రివ్యూ :
ఏమిటి :
10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీ
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ
Published date : 29 Nov 2019 05:35PM

Photo Stories