Skip to main content

Bhubharati: తెలంగాణలో నేటి నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని దశలవారీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana Revenue Minister Ponguleti Srinivasa Reddy announces phased implementation of Bhu Bharati Act  BhuBharati Act to be rolled out in 28 Mandals in Telangana from May 5

ఈ చట్టం అమలులో భాగంగా మే 5వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.

28 జిల్లాల్లోని 28 మండలాల్లో..
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేసి మొత్తం 28 రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. మే 5వ తేదీ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఇందులో ప్రతి జిల్లా కలెక్టర్ హాజరై, రైతుల సమస్యలు, సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.

రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశ్యం
ఈ సదస్సుల ప్రధాన లక్ష్యం భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడమే. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ సమావేశాలు జరగనున్నాయి. అదే సమయంలో భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశంగా మంత్రి పేర్కొన్నారు.

Farmer ID Card: ప్రతి రైతుకూ గుర్తింపు కార్డు.. నమోదు చేసుకోండిలా..

రెవెన్యూ మంత్రి మాట్లాడుతూ.. "సీఎం రేవంత్ రెడ్డి సలహాలు, సూచనల మేరకు రైతుల కళ్లలో ఆనందం రావాలనే ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చాం. ఇది భూపరిపాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలికే చట్టం. ఏప్రిల్ 17 నుంచి 30 వరకు ఇప్పటికే నాలుగు మండలాల్లో సదస్సులు నిర్వహించాం. ఈ నెలలో మిగతా 28 మండలాల్లో కొనసాగుతాయి. భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించడం, వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యం." అని తెలిపారు.

భూభారతి అమలు జరగనున్న మండలాల జాబితా 

  1. ఆదిలాబాద్‌ – భోరజ్
  2. భద్రాద్రి కొత్తగూడెం – సుజాతనగర్
  3. హనుమకొండ – నడికుడు
  4. జగిత్యాల – బుగ్గారం
  5. జనగామ – ఘన్‌పూర్
  6. జయశంకర్‌ భూపాలపల్లి – రేగొండ
  7. జోగులాంబ గద్వాల – ఇటిక్యాల
  8. కరీంనగర్‌ – సైదాపూర్
  9. కుమురం భీం – పెంచికల్‌పేట్
  10. మహబూబాబాద్‌ – దంతాలపల్లి
  11. మహబూబ్‌నగర్‌ – మూసాపేట
  12. మంచిర్యాల – భీమారం
  13. మెదక్‌ – చిలప్‌చెడ్
  14. మేడ్చల్‌ మల్కాజిగిరి – కీసర
  15. నాగర్‌ కర్నూల్‌ – పెంట్లవల్లి
  16. నల్గొండ – నకిరేకల్
  17. నిర్మల్‌ – కుంటాల
  18. నిజామాబాద్‌ – మెండోరా
  19. పెద్దపల్లి – ఎలిగేడ్
  20. రాజన్న సిరిసిల్ల – రుద్రంగి
  21. రంగారెడ్డి – కుందుర్గ్
  22. సంగారెడ్డి – కొండాపూర్
  23. సిద్దిపేట – అక్కన్నపేట
  24. సూర్యాపేట – గరిడేపల్లి
  25. వికారాబాద్‌ – ధరూర్
  26. వనపర్తి – గోపాల్‌పేట
  27. వరంగల్‌ – వర్ధన్నపేట
  28. యాదాద్రి భువనగిరి – ఆత్మకూర్

Indiramma House: ఇందిరమ్మ ఇళ్లు.. ఇకపై ప్రతి సోమవారం అకౌంట్లోకి డబ్బులు

Published date : 05 May 2025 01:43PM

Photo Stories