మే 2018 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ భారత పర్యటన
నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ మే 24న భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన మార్క్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలపై చర్చించారు. అనంతరం అంతర్జాతీయ సౌర కూటమిలో సభ్య దేశంగా నెదర్లాండ్‌స చేరిందని మోదీ తెలియజేశారు. అలాగే అణు సరఫరా బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వానికి నెదర్లాండ్‌స మద్దతిస్తుందని రూట్ చెప్పారు. భారత్‌లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్‌స మూడో స్థానంలో ఉంది.
మరోవైపు మే 29 నుంచి ఐదు రోజుల పాటు ఇండోనేసియా, సింగపూర్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా 28 ఆసియా-పసిఫిక్ దేశాల రక్షణ మంత్రులు, ఆర్మీ చీఫ్‌లు పాల్గొనే షాంగ్రీ లా సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెదర్లాండ్స్ ప్రధాని భారత పర్యటన
ఎప్పుడు : మే 24
ఎవరు : మార్క్ రూట్
ఎందుకు : ద్వైపాక్షిక, ఉగ్రవాద అంశాలపై చర్చించేందుకు
బ్రిటన్‌లో భారతీయులకు నాలుగో స్థానం
2017 సంవత్సరంలో బ్రిటన్‌లో ఉన్న విదేశీయుల్లో సంఖ్యాపరంగా 3.46 లక్షల మంది జనాభాతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 10 లక్షల జనాభాతో పోలండ్ ప్రథమ స్థానం దక్కించుకోగా 4.11 లక్షలతో రుమేనియా, 3.50 లక్షలతో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మరోవైపు వలస జనాభా పెరుగుదలలో రుమేనియా మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు బ్రిటన్ వలసలపై 2017 వివరాలను జాతీయ గణాంకాల కార్యాలయం(ఓఎన్‌ఎస్) మే 24న వెల్లడించింది.
అయితే యూరప్ దేశాలను మినహాయిస్తే వలసల్లో భారతీయులదే ప్రథమస్థానం కాగా తర్వాతి స్థానంలో 1.88 లక్షల జనభాతో పాకిస్తాన్ ఉంది. అలాగే బ్రిటన్‌కు వెళ్లే యాత్రికులలోనూ అత్యధికంగా భారతీయులే ఉండగా రష్యా, పాకిస్తాన్, చైనా దేశీయులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2016లో బ్రిటన్‌లో ఉన్న విదేశీయుల్లో సంఖ్యాపరంగా భారతీయులు రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్‌లో భారతీయులకు నాలుగో స్థానం
ఎప్పుడు : మే 24
ఎవరు : బ్రిటన్
బంగ్లాదేశ్ భవన్‌ను ప్రారంభించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి బంగ్లాదేశ్ భవన్‌ను మే 25న ప్రారంభించారు. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలకు చిహ్నంగా పశ్చిమబెంగాల్‌లోని శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్శీటీలో బంగ్లాదేశ్ ఈ భవనాన్ని నిర్మించింది. అలాగే వర్శిటీ స్నాతకోత్సవాల్లో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు. అనంతరం మోదీతో హసీనా భేటీ అయి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంగ్లాదేశ్ భవన్ ప్రారంభం
ఎప్పుడు : మే 25
ఎవరు : న రేంద్ర మోదీ, షేక్ హసీనా
ఎక్కడ : శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్శీటీ, పశ్చిమబెంగాల్
రష్యా అధ్యక్షుడితో మోదీ భేటీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలోని సోచి నగరంలో మే 21న అనధికారికంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దైపాక్షి క, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం వంటి అంతర్జాతీయ అంశాల పై ఇరు దేశాధినేత లు చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా అధ్యక్షుడితో మోదీ భేటీ
ఎప్పుడు : మే 21
ఎక్కడ : సోచి, రష్యా
ఎందుకు : దైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు
భారత్-మయన్మార్ మధ్య ఏడు ఒప్పందాలు
భారత్-మయన్మార్‌ల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు ఇరు దేశాలు మే 11న ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మయన్మార్ చేరుకున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్టేట్ కౌన్సిలర్ అంగ్ సాన్ సూచీతో, అధ్యక్షుడు విన్ మియింట్‌తో చర్చలు జరిపి ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-మయన్మార్ మధ్య ఏడు ఒప్పందాలు
ఎప్పుడు : మే 11
ఎవరు : విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్
ఎక్కడ : మయన్మార్
నేపాల్ పర్యటనలో మోదీ
రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మే 11న నేపాల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని కేపీ ఓలితో కలసి జనక్‌పూర్-అయోధ్య మధ్య డెరైక్ట్ బస్సు సర్వీసును మోదీ ప్రారంభించారు. అలాగే తూర్పు నేపాల్‌లోని టమ్‌లింగ్‌టార్‌లో 900 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రానికి రిమోట్ సిస్టం ద్వారా శంకుస్థాపన చేశారు. నేపాల్, భారత్‌లో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి ఉద్దేశించిన రామాయణ సర్క్యూట్‌లో భాగంగానే ఈ బస్సు సర్వీసును నిర్వహిస్తున్నారు. సీతాదేవి జన్మస్థానంగా విశ్వసిస్తున్న జనక్‌పూర్‌లోని జానకి దేవాలయాన్ని సందర్శించిన మోదీ జనక్‌పూర్, దాని పొరుగు ప్రాంతాల అభివృద్ధికి రూ.100 కోట్ల సాయం ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేపాల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : మే 11
ఎందుకు : విదేశీ పర్యటనలో భాగంగా
భారత్-దక్షిణాఫ్రికా బిజినెస్ సమిట్
నూతన పారిశ్రామిక విధానంతో ప్రపంచ దేశాల వృద్ధికి భారత్ చోదకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. జొహానెస్‌బర్గ్‌లో మే 2న జరిగిన భారత్-దక్షిణాఫ్రికా బిజినెస్ సమిట్ 2018లో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. 1956లో తొలి పారిశ్రామిక విధానం పారిశ్రామికీకరణపై ప్రధానంగా దృష్టి పెట్టగా, 1991లో ఆర్థిక సంక్షోభాల నుంచి బయట పడేందుకు రెండో విధానం అమలు చేయాల్సి వచ్చిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-దక్షిణాఫ్రికా బిజినెస్ సమిట్
ఎప్పుడు : మే 2
ఎవరు : సురేశ్ ప్రభు
భారతీయులకే అత్యధిక హెచ్-1బీ వీసాలు
అమెరికాలో విదేశీయులు ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్-1బీ వీసాలు 2016, 2017 సంవత్సరాల్లో భారతీయులకే అత్యధికంగా దక్కారుు. 2016లో 74.2%, 2017లో 75.6 శాతం హెచ్-1బీ వీసాలు లభించాయి. భారత్ తర్వాత చైనాకు అత్యధికంగా వీసాలు లభించాయని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) మే 8న వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారతీయులకు అత్యధిక హెచ్-1బీ వీసాలు
ఎప్పుడు : 2016, 2017
ఎవరు : అమెరికా ప్రభుత్వం
భారత్-చైనాల శిఖరాగ్ర సదస్సు
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల అనధికార శిఖరాగ్ర సదస్సు ఏప్రిల్ 27న ప్రారంభమైంది. చైనాలోని పర్యాటక కేంద్రమైన వుహాన్‌లో ఇరు దేశాధినేతలు సమావేశమైయ్యారు. హృదయపూర్వక సమావేశం (హార్ట్ టు హార్ట్ సమ్మిట్)గా పేర్కొంటున్న ఈ సదస్సులో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రపంచ పురోగతిలో కీలక పాత్ర పోషించే సమర్థత భారత్, చైనాలకుందని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్-చైనాల శిఖరాగ్ర సదస్సు
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : నరేంద్ర మోదీ, షి జిన్‌పింగ్
ఎక్కడ : వుహాన్, చైనా
ఎందుకు : ద్వైపాక్షిక, అంశాలపై చర్చించేందుకు
ఇస్లామాబాద్‌లో ‘నిమ్రానా డైలాగ్’
భారత్-పాకిస్తాన్‌ల మధ్య అనధికార రాయబార విధానం పునరుద్ధరణకు భారత ప్రతినిధుల బృందం ఏప్రిల్ 28 నుంచి 30 వరకు పాకిస్తాన్‌లో పర్యటించింది. ఇటీవల భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో తాజా చర్చలు జరగ్గా, భారత బృందానికి విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వివేక్ కట్జూ నేతృత్వం వహించారు. ‘నిమ్రానా డైలాగ్’ గా పిలిచే ఈ అనధికార చర్చలు 1990ల్లోనే మొదలయ్యాయి. రాజస్తాన్‌లో ఉండే నిమ్రానా కోటలో తొలిసారి ఈ చర్చలు జరగడంతో వీటికి ఆ పేరు వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇస్లామాబాద్‌లో ‘నిమ్రానా డైలాగ్’
ఎప్పుడు : మే 1
ఎవరు : భారత్ - పాకిస్తాన్
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల కోసం అనధికార రాయబార విధానంను పునరుద్ధరించేందుకు

Published date : 23 May 2018 03:28PM