జూన్ 2018 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
29 అమెరికా ఉత్పత్తులపై సుంకం పెంపు
అమెరికా నుంచి దిగుమతి అయ్యే పప్పులు, స్టీల్, ఐరన్ లాంటి 29 ఉత్పత్తులపై 50 శాతం దిగుమతి సుంకంను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం జూన్ 21న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెంచిన సుంకాలు ఆగస్ట్ 4 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అమెరికా దిగుమతి చేసుకొనే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై మార్చి 9న ఆ దేశం టారిఫ్‌లను పెంచడంతో 41 మిలియన్ డాలర్ల విలువ మేర (రూ.1,600 కోట్లు) భారత ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా ఉత్పత్తులపై సుంకంను పెంచింది. కస్టమ్స్ డ్యూటీని పెంచాలనుకుంటున్న 30 ఉత్పత్తుల జాబితాను గత వారమే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు భారత్ సమర్పించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 29 అమెరికా ఉత్పత్తులపై సుంకం పెంపు
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : భారత్
ఎందుకు : అమెరికా దిగుమతి చేసుకొనే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ఆ దేశం టారిఫ్‌లు పెంచినందుకు
సీషెల్స్‌కు భారత్ 10 కోట్ల డాలర్ల రుణం
సీషెల్స్‌లో మిలటరీ మౌలిక వసతుల అభివృద్ధి కోసం భారత్ 10 కోట్ల డాలర్ల (దాదాపు రూ.680 కోట్లు) రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో సీషెల్స్‌లోని అసంప్షన్ ద్వీపంలో నౌకాదళ కేంద్రంను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు భారత పర్యటనలో ఉన్న సీషెల్స్ అధ్యక్షుడు డేనీ ఫార్, ప్రధాని మోదీ మధ్య జూన్ 25న ఒక ఒప్పందం కుదిరింది. దీంతో పాటు సీషెల్స్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ, తీరప్రాంత భద్రత, వైట్ షిప్పింగ్ (మిలటరీయేతర వాణిజ్య నౌకల రవాణాపై సమాచార మార్పిడి), సీషెల్స్ దౌత్యాధికారులకు శిక్షణ (ఇరుదేశాల విదేశాంగ శాఖల మధ్య), గోవా సిటీ కార్పొరేషన్- సిటీ ఆఫ్ విక్టోరియా (సీషెల్స్) మధ్య పరస్పర సహకారంపై ఒప్పందాలు కుదిరాయి.
హిందూ మహాసముద్రంలో 115 ద్వీపాల సమూహమైన సీషెల్స్‌లో తన ప్రాభవాన్ని పెంచుకోవడం భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకం. ఈ ఒప్పందంతో అది సాకారం కానుంది. ఇప్పటికే ఈ సముద్రంలోని వివిధ దేశాల్లో తన మిలటరీ అస్తిత్వాన్ని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. 2015లోనే అసంప్షన్ ఐలాండ్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీషెల్స్‌కు భారత్ 10 కోట్ల డాలర్ల రుణం
ఎప్పుడు : త్వరలో
ఎవరు : భారత్
ఎందుకు : మిలటరీ మౌలిక వసతుల అభివృద్ధి కోసం
భారత్‌కు ఆరు అపాచీ హెలికాప్టర్లు
భారత్‌కు ఆరు అపాచీ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం జూన్ 13న ఆమోదం తెలిపింది. ఈ మేరకు 930 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఆరు ‘ఏహెచ్-64ఈ’ హెలికాప్టర్లను పెంటగాన్ డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజెన్సీ అందిస్తుంది. ఒప్పందంలో భాగంగా ఫైర్ కంట్రోల్ రాడార్లు, హెల్‌ఫూర్ లాంగ్‌బౌ మిస్సైళ్లు, నైట్ విజన్ సెన్సార్లు, ఇంట్రిగల్ నావిగేషన్ సిస్టమ్స్ కూడా భారత్‌కు అందుతాయి. ప్రస్తుతం అమెరికా సైన్యం వినియోగిస్తున్న ఏహెచ్-64ఈ హెలికాప్టర్లు బహుముఖ దాడులు చేయగలవు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు ఆరు అపాచీ హెలికాప్టర్ల విక్రయానికి ఆమోదం
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : అమెరికా ప్రభుత్వం
ఇండోనేసియాతో భారత్ 15 ఒప్పందాలు
విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో తో మే 30న జకార్తాలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్, ఇండోనేసియా మధ్య రక్షణ రంగంలో సహకారం, అంతరిక్ష ప్రయోగాలు, శాస్త్ర-సాంకేతికత, రైల్వేలు, వైద్యం, సాంస్కృతిక సంబంధాల బలోపేతం సహా 15 ఒప్పందాలు జరిగాయి.
1982లో చేసిన సముద్ర చట్టాలపై ఐరాస సదస్సు (యూఎన్‌సీఎల్‌ఓఎస్), 1976 నాటి ఆగ్నేయాసియా మైత్రి, సహకార ఒప్పందం (టీఏసీ)ల ప్రకారం భారత్, ఇండోనేసియా, ఇతర ఇండో-పసిఫిక్ దేశాల హక్కులను కాపాడాల్సిన ఆవశ్యకతనూ ఇరువురు నేతలు చర్చించారు. భారత్‌లో పర్యటించే ఇండోనేసియా పౌరులకు 30 రోజుల పాటు ఉచిత వీసా ఇస్తామని మోదీ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండోనేసియాతో భారత్ 15 ఒప్పందాలు
ఎప్పుడు : మే 30
ఎవరు : భారత ప్రధాని మోదీ - ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో
ఎక్కడ : జకార్తా, ఇండోనేసియా
సింగపూర్ పర్యటనలో ప్రధాని మోదీ
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మే 31న సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతర్జాతీయీకరణలో భాగంగా భారత్‌కు చెందిన డిజిటల్ చెల్లింపుల యాప్‌లు భీమ్, రూపే, ఎస్‌బీఐలను సింగపూర్‌లో మోదీ ఆవిష్కరించారు. ఇందుకోసం సింగపూర్‌కు చెందిన నెట్‌వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ (నెట్స్)తో రూపే యాప్‌ను అనుసంధానించారు.
సింగపూర్ పర్యటనకు ముందుగా ఇండోనేసియా పర్యటన ముగించుకుని మలేషియా చేరుకున్న మోదీ ఆ దేశ ప్రధాని మహాథిర్ మొహమ్మద్‌తో కలిసి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సింగపూర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : మే 31
ఎందుకు : మూడు దేశాల పర్యటనలో భాగంగా
షాంగ్రీ-లా సమావేశంలో పాల్గొన్న మోదీ
సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ 8 ఆసియా-పసిఫిక్ దేశాల అంతర ప్రభుత్వ భద్రతా వేదిక అయిన షాంగ్రీలా సదస్సులో జూన్ 1న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సముద్ర తీరం ఇండో-పసిఫిక్ ప్రాంత వివాదాలను ఈ ప్రాంత దేశాలన్నీ కలిసి పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. అనంతరం సింగపూర్‌లోని నన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్‌టీయూ)లో నిర్వహించిన ట్రాన్స్ ఫార్మింగ్ ఆసియా త్రూ ఇన్నోవేషన్’ అనే సదస్సులో మోదీ ప్రసంగించారు.
సదస్సులో ఎన్‌టీయూ, భారత వర్సిటీల మధ్య విద్య, పారిశ్రామిక భాగస్వామ్యానికి సంబంధించి ఆరు ఒప్పందాలు కుదరగా భారత్ సింగపూర్‌ల నావికా దళాల మధ్య రవాణా సహకారంతో సహా 8 ఒప్పందాలు కుదిరాయి. ఈ సదస్సును 2002 నుంచి సింగపూర్‌లోని షాంగ్రి-లా అనే హోటల్‌లో ఏటా నిర్వహిస్తున్నారు.
సింగపూర్ మాజీ దౌత్యవేత ప్రొఫెసర్ టామీ కోహ్‌కి మోదీ పద్మశ్రీ అవార్డును అందజేశారు. ఏసియాన్ (అసోసియేన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్) రజతోత్సవాలు, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2018 జనవరిలో టామీ కి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దీంతో ఏసియాన్ సభ్యదేశానికి చెంది ఈ అవార్డు అందుకున్న పదో వ్యక్తిగా టామీ నిలిచారు. టామీ 1981, 82లలో సముద్ర చట్టాలపై జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సుకు అధ్యక్షత వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : షాంగ్రీ-లా సమావేశంలో పాల్గొన్న మోదీ
ఎప్పుడు : జూన్ 1
ఎందుకు : సింగపూర్ పర్యటనలో భాగంగా
అమెరికా రక్షణ కార్యదర్శితో మోదీ భేటీ
అమెరికా రక్షణ కార్యదర్శి జిమ్ మాటిస్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్‌లో జూన్ 2 న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక రక్షణ బంధం, భద్రతా, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. మరోవైపు మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన ప్రాంతంలో సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ తోంగ్‌తో కలిసి మోదీ ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత సింగపూర్‌లోని జాతీయ ఉద్యానవనాన్ని మోదీ సంద ర్శించడంతో మోదీ పర్యటనకు జ్ఞాపకంగా ఉద్యానవనంలోని ఓ పుష్పానికి ‘డెండ్రోబియమ్ నరేంద్ర మోదీ’ అని పేరు పెట్టారు. అనంతరం సింగపూర్‌లోని చాంగీ నౌకా కేంద్రం, మరియమ్మన్ అనే హిందూ దేవాలయం, చులియా మసీదు, బౌద్ధ దేవాలయం, మ్యూజియంను మోదీ సందర్శించారు.
భారత యాక్ట్ ఈస్ట్ పాలసీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇండోనేసియా, మలేషియా, సింగపూర్ దేశాల్లో మే 29 నుంచి ఐదురోజుల పాటు మోదీ పర్యటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా రక్షణ కార్యదర్శితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : జిమ్ మాటిస్
ఎక్కడ : సింగపూర్
అమెరికాలో మలబార్ సైనిక విన్యాసాలు
భారత్, అమెరికా, జపాన్ ల సంయుక్త సైనిక యుద్ధ విన్యాసాలు ‘మలబార్ ఎక్సర్‌సైజ్’ ను అమెరికాలో తొలిసారిగా నిర్వహించనున్నారు. మలబార్ విన్యాసాలు - 2018 పేరిట జూన్ 7 నుంచి 10 వరకు గ్వామ్‌లోని హార్బర్ ఫేజ్, 11 నుంచి 16 వరకు సముద్ర తీరంలో నిర్వహిస్తారు. ఈ విన్యాసాల్లో భారత తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ కమోర్తా పాల్గొననున్నాయి. ఇండో-పసిఫిక్ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మలబార్ విన్యాసాలు-2018
ఎప్పుడు : జూన్ 7 నుంచి 16 వరకు
ఎవరు : భారత్, జపాన్, అమెరికా
ఎక్కడ : గ్వామ్, అమెరికా
ఎందుకు : తీరప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు
దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) విదేశాంగ మంత్రుల సదస్సు దక్షిణాఫ్రికాలో జూన్ 4న ప్రారంభమైంది. ఈ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, లిండివె సిసులు, మార్కస్ బెజెరా అబ్బాట్ గల్వాయో, సెర్జీ లావ్రోవ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, అక్రమ నగదు చలామణీని అరికట్టేందుకు బ్రిక్స్ దేశాలు ఐక్య కార్యాచరణ చేపట్టాలని సుష్మా పిలుపినిచ్చారు. అలాగే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను కలసిన సుష్మా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. తదుపరి ఐబీఎస్‌ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) విదేశాంగ మంత్రుల సదస్సుకు సుష్మా స్వరాజ్ అధ్యక్షత వహించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జూన్ 4
ఎక్కడ : దక్షిణాఫ్రికా

Published date : 03 Jul 2018 05:36PM