Telangana: ‘రూర్బన్’ పథకం అమల్లో తెలంగాణకు ప్రథమస్థానం
దేశవ్యాప్తంగా 295 క్లస్టర్ల ర్యాంకింగ్‌లలో తొలి రెండు స్థానాలను రాష్ట్రం కైవసం చేసుకుంది. ఈ క్లస్టర్లకు గాను ప్రథమస్థానంలో ర్యాకల్ (సంగారెడ్డి జిల్లా), ద్వితీయస్థానంలో జుక్కల్ (కామారెడ్డి జిల్లా) నిలిచాయి. పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలు గ్రామాల్లోనూ అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ పథకాన్ని అమలుచేస్తారు. నేషనల్ రూర్బన్ మిషన్ వెబ్‌సైట్ rurban.gov.in లో రోజువారీ అప్‌డేట్ చేసిన వివరాల ప్రకారం ఇప్పటివరకు సాధించిన ప్రగతి, చేరుకున్న లక్ష్యాలను బట్టి జాతీయస్థాయిలో తెలంగాణ టాప్‌ర్యాంక్‌లో నిలిచినట్లు స్పష్టమైంది.
Also Read:
GK Awards Quiz:‘ఇండియన్ ఇన్నింగ్స్: ది జర్నీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఫ్రమ్ 1947’ పుస్తక రచయిత?
GK International Quiz: ప్రపంచంలో తొలి బిట్‌కాయిన్ నగరాన్ని ఏ దేశం నిర్మించాలని యోచిస్తోంది?
GK Important Dates Quiz: జాతీయ (భారతీయ) అవయవ దాన దినోత్సవం ఎప్పుడు?
డిసెంబర్ 22వ తేదీన అప్‌డేట్ చేసిన సమాచారం ప్రకారం దేశంలోనే రూర్బన్ ప్రగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన సంగారెడ్డి జిల్లాలోని ర్యాకల్ క్లస్టర్ (నారాయణఖేడ్ మండలం) రూ.4.17 కోట్ల రూర్బన్ క్రిటికల్ గ్యాప్ ఫండ్ నిధులతో చేపట్టిన (బీఎంసీసీ) పాల శీతలీకరణ కేంద్రం 3 వేల మంది రైతుల నుంచి రోజూ 12 వేల నుంచి 22 వేల లీటర్ల పాలు సేకరిస్తోంది. తద్వారా రైతులకు ఏడాదికి రూ.60,000 వరకు అదనపు ఆదాయం అందించటమే కాకుండా 460 మంది మహిళా సంఘాల సభ్యులకు సబ్సిడీలో గేదెలు ఇచి్చంది. అలాగే ర్యాకల్ క్లస్టర్‌లో చేపట్టిన మూడు వ్యవసాయ గిడ్డంగులు, 4 కల్లాలకు గాను రూ.1.65 కోట్ల రూర్బన్ క్రిటికల్ గ్యాప్ ఫండ్ నిధులతో నిల్వ చేసుకొనే సౌకర్యం కలి్పస్తున్నారు. రూర్బన్ ప్రగతిలో రెండవ స్థానంలో నిలిచిన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ క్లస్టర్ (జుక్కల్ మండలం), రూ.3.45 కోట్ల రూర్బన్ క్రిటికల్ గ్యాప్ ఫండ్ నిధులతో రూ.3 కోట్ల కన్వర్జెన్స్ నిధులతో తొమ్మిది వ్యవసాయ గిడ్డంగులు నిర్మించి, 14,296 మంది రైతులు ధాన్యం నిల్వ చేసుకొనే వీలు కల్పించారు. లాభదాయక సమయంలో ధాన్యం విక్రయం ద్వారా ఏడాదికి రూ.18,000 నుంచి రూ.22,500 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇక రూ.17.20 లక్షల క్రిటికల్ గ్యాప్ ఫండ్ రూర్బన్ నిధులతో 5,000 లీటర్ల కెపాసిటీ కలిగిన పాల శీతలీకరణ కేంద్రం ఏర్పా టు చేయటం ద్వారా 321 మంది రైతులు రోజూ 4,020 లీటర్ల పాలు సేకరించి, సంవత్సరానికి రూ. 57,600ల అదనపు ఆదాయం పొందుతున్నారు. కాగా, తెలంగాణకు మూడు విడతల్లో 17 క్లస్టర్లు మంజూరయ్యాయి.
అసలు రూర్బన్ పథకం ఏమిటీ..?
➤ ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తారు.
➤ స్థానిక వనరులను అందిపుచ్చుకొని, గ్రామాల మధ్య పోటీ తత్తా్వన్ని పెంచి వాటి అభివృద్ధికి పరస్పరం దోహదపడుతూ.. వాటిని ఆర్థిక, సామాజిక అభివృద్ధి కేంద్రాలుగా తయారు చేసే ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే ఇది.
➤ ఈ విధంగా అభివృద్ధి చెందిన గ్రామాల సముదాయాన్నే ‘రూర్బన్ క్లస్టర్’అంటారు.
➤ కన్వర్జెన్స్ పథకం తోడు రూర్బన్ లక్ష్యాలను సమగ్రంగా అమలు చేసేందుకు గిరిజనేతర రూర్బన్ క్లస్టర్లకు రూ.30 కోట్లు, గిరిజన రూర్బన్ క్లస్టర్లకు రూ.15 కోట్లు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ‘క్రిటికల్ గ్యాప్ ఫండ్’సమకూరుస్తాయి.
➤ పథకంలో వృత్తి నైపుణ్య అభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు, వ్యవసాయాభివృద్ధి–ఆగ్రోప్రాసెసింగ్, వ్యవస్యాయ విస్తరణ సేవలు, గోదాముల నిర్మాణం చేపడతారు.
➤ వ్యవసాయ అనుబంధ శాఖల అభివృద్ధి (పశు గణాభివృద్ధి–డైరీ, ఉద్యానాభివృద్ధి, మత్స్య పరిశ్రమ), వైద్య సేవలు, విద్యా–పాఠశాల విద్యా/ఉన్నత విద్యా సౌకర్యాలు పెంపొందిస్తారు.