ఫిబ్రవరి 2018 అవార్డ్స్
Sakshi Education
నరిశెట్టి రాజుకు ‘ఎన్‌ఆర్ చందూర్’ అవార్డు
అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో ఉన్నతస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగుతేజం, ప్రముఖ జర్నలిస్టు, అమెరికాకు చెందిన గిజ్‌మోడో మీడియా గ్రూప్ సీఈవో నరిశెట్టి రాజు 2018 సంవత్సరానికి గాను ఎన్‌ఆర్ చందూర్ జగతి పురస్కారాన్ని అందుకున్నారు. ఫిబ్రవరి 21న ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడి చేతుల మీదుగా నరిశెట్టి రాజు పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు ఎన్‌ఆర్ చందూర్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు, అమరజీవి శ్రీపొట్టిశ్రీరాములు స్మారక సమితి ఏటా ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.
తెనాలి పాత తాలూకాలోని చేబ్రోలుకు చెందిన నరిశెట్టి రాజు జర్నలిజంలో చేరిన కొత్తలో తెలుగు, ఆంగ్ల పత్రికల్లో పని చేశారు. అనంతరం అమెరికాలోని డేటన్ డైలీ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్‌ల్లో రిపోర్టర్ స్థాయి నుంచి మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి ఎదిగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఆర్ చందూర్ అవార్డు - 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : నరిశెట్టి రాజు
ఎక్కడ : ఢిల్లీలో
‘శ్రమ్’ పురస్కారాల ప్రదానం
దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో నైపుణ్యంతో, నిజాయితీగా పనిచేసే సిబ్బందికి, కార్మిక అభివృద్ధికోసం పనిచేసిన 338 మందిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ‘ప్రధాన మంత్రి శ్రమ్’పురస్కారాలతో సత్కరించింది. ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే ఈ అవార్డులను గత ఆరేళ్లకుగానూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఫిబ్రవరి 26న ఢిల్లీలో ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని బ్రహ్మాస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కె.రామ్‌ప్రసాద్, హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌కు చెందిన సి.కుమార్, జి.గోవర్దన్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, రాజేందర్ ప్రసాద్ పురస్కారాలు దక్కించుకున్నారు.
యశ్ చోప్రా అవార్డు అందుకున్న ఆశా భోంస్లే
లెజండరీ సింగర్ ఆశా భోంస్లేకు ప్రతిష్టాత్మక యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ ఫిబ్రవరి 16న ముంబైలో ప్రదానం చేసింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆశా భోంస్లే 20 భాషల్లో దాదాపుగా 11వేల పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆమెకు యశ్ చోప్రా అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు టీయస్సార్. ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, నటి జయప్రద, బాలీవుడ్ నటి రేఖ పాల్గొన్నారు.
2012లో చనిపోయిన యశ్ చోప్రా జ్ఙాపకార్థం టి. సుబ్బరామిరెడ్డి, అను రంజన్, శశి రంజన్‌లు నెలకొల్పిన ఈ అవార్డును ఇదివరకు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు 10 లక్షల నగదు కూడా అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆశా భోంస్లేకు యశ్ చోప్రా అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులకు ‘ఎస్’ పురస్కారం
వినూత్న ఆవిష్కరణల్లో ముందుండే ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు అరుదైన అవార్డును సొంతం చేసుకున్నారు. తమ ప్రతిభాపాటవాలతో ప్రతిష్టాత్మకంగా భావించే యంగ్ ఇంజినీర్స్ అండ్ సైంటిస్ట్స్(వైఈఎస్) అవార్డును కైవసం చేసుకున్నారు. ఏటా హోండా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ పురస్కారాన్ని విద్యాసంవత్సరంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇస్తుంటారు. ప్రస్తుతం 2017-18 సంవత్సరానికి గాను పియూష్ నందా, బిందు సాంచెట్టి, అయాన్ మజుందార్‌లు ఈ అవార్డును గెలుచుకున్నారు. వీరంతా తమతమ కోర్సులలో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులే. హోండా సంస్థ అధికారులు మాట్లాడుతూ.. ఎస్ అవార్డు సొంతం చేసుకున్న ఈ ముగ్గురు విద్యార్థులకు 3వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందిస్తామని ప్రకటించారు. దీనితోపాటు జపాన్‌లోని రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో క్రెడిట్ గ్రాంటింగ్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులకు ‘ఎస్’ పురస్కారం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : హోండా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ప్రొఫెసర్ జగదీశ్‌కు నాయుడమ్మ అవార్డు
నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్‌స సంస్థ ఏటా అందించే ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డును ఈ ఏడాది ఆస్ట్రేలియాకు చెందిన ప్రొ.డాక్టర్ చెన్నుపాటి జగదీశ్‌కు అందచేస్తున్నట్లు ఆ సంస్థ డెరైక్టర్ ఎ.జగదీశ్ ఫిబ్రవరి 7న తెలిపారు. ఆస్ట్రేలియా నేషనల్ వర్సిటీలో జగదీశ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఢిల్లీ వర్సిటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు. ఆయన సెమీ కండక్టర్ ఆఫ్టో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీలో విశేష కృషి చేశారు. పలు అంశాలపై ఆయన రాసిన 870కుపైగా పరిశోధనాపత్రాలు ప్రచురిత మయ్యాయి. అమెరికాలో 5 పేటెంట్లతో పాటు 11 పుస్తకాలు ప్రచురించారు. గతంలో ఈ అవార్డును కె.కస్తూరి రంగన్, నందన్ నీలేకని తదితర ప్రముఖులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాయుడమ్మ అవార్డు - 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ప్రొ.డాక్టర్ చెన్నుపాటి జగదీశ్
నౌహెరాకు పవర్ ఫుల్ ఉమెన్ అచీవర్ అవార్డు
నెక్స్‌బ్రాండ్ తాజాగా ‘పవర్‌ఫుల్ ఉమెన్ అచీవర్’ అవార్డును ప్రకటించింది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో హీరా గ్రూప్ వ్యవస్థాపకురాలు, సీఈవో షేక్ నౌహెరా ఈ అవార్డును అందుకున్నారు. ఆమె 19 ఏళ్ల వయసులో విద్యా రంగంలో కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత మల్టీ డైవర్సిఫైడ్ కంపెనీ ‘హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ను స్థాపించారు. ఇది జువెలరీ, టెక్స్‌టైల్, ఎడ్యుకేషన్, మినరల్ వాటర్, గ్రానైట్, గోల్డ్, టూర్స్ అండ్ ట్రావెల్స్, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తోంది. నౌహెరా ఇటీవల ‘ఆల్ ఇండియా మహిళా సాధికారత పార్టీ’ని స్థాపించడం ద్వారా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెక్స్‌బ్రాండ్ ‘పవర్‌ఫుల్ ఉమెన్ అచీవర్’ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : షేక్ నౌహెరా
ప్రముఖ వైద్యుడు జీఆర్ రెడ్డికి అంతర్జాతీయ అవార్డు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ జీఆర్ రెడ్డికి ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ అవార్డు లభించింది. అంధత్వ నివారణకు కృషి చేస్తున్న వైద్యులకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. భారతదేశం నుంచి జీఆర్‌రెడ్డికి మాత్రమే ఈ పురస్కారం దక్కింది. జీఆర్ రెడ్డి గ్రామీణ ప్రాంతంలో గ్లకోమా (నీటి కాసులు)పై అవగాహన కల్పించడంతోపాటు 30 ఏళ్లుగా డయాబెటిక్ రెటినోపతిని ప్రజలకు చేరువ చేశారు. భారత్‌లో అత్యధికంగా రెటీనా శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్‌గా కూడా ఆయనకు గుర్తింపు ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : ప్రముఖ వైద్యుడు జీఆర్ రెడ్డి
ఎందుకు :
అంధత్వ నివారణకు కృషి చేస్తున్నందుకు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు గోల్డెన్ పీకాక్ అవార్డు
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) విభాగంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గోల్డెన్ పీకాక్ అవార్డును చేజిక్కించుకుంది. బెంగళూరులో ఫిబ్రవరి 12న జరిగిన అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెరైక్టర్స్ సదస్సులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య ఎయిర్‌పోర్టు నిర్వాహకులైన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈఓ ఎస్‌జీకే కిశోర్ మాట్లాడుతూ..పన్నెండేళ్లుగా జీఎంఆర్ సంస్థ వరలక్ష్మీ ఫౌండేషన్ ద్వారా విమానాశ్రయ పరిసర గ్రామాల్లో యువతకు ఉపాధి అవకాశాలు, వైద్య, విద్య, మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు గోల్డెన్ పీకాక్ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎందుకు : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) విభాగంలో
నరిశెట్టికి ఎన్‌ఆర్ చందూర్-జగతి అవార్డు
ప్రముఖ సాహితీవేత్త ఎన్‌ఆర్ చందూర్-జగతి అవార్డు 2018ని గిజ్‌మోడో మీడియా గ్రూప్ సీఈవో రాజు నరిశెట్టి (అమెరికా)కి ప్రకటించారు. ఈ మేరకు మాజీ ఎంపీ, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 21న న్యూఢీల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమంలో అవార్డుని ప్రదానం చేస్తామని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఆర్ చందూర్-జగతి అవార్డు 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : రాజు నరిశెట్టి(అమెరికా)

Published date : 21 Feb 2018 03:59PM