Skip to main content

నవంబర్ 2017 అవార్డ్స్

అనిల్ దవే, చంద్ర భూషణ్‌లకు ఓజోన్ అవార్డు
Current Affairs
కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి అనిల్ దవే, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) డిప్యూటీ డెరైక్టర్ చంద్ర భూషణ్‌లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్ అవార్డులు అందుకున్నారు. రువాండాలో గత ఏడాది కిగాలీ ఒప్పందం కుదరడంలో దవే చొరవకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం ‘రాజకీయ నాయకత్వ అవార్డు’ను ప్రకటించారు. దవే తరఫున భారత పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అవార్డు స్వీకరించారు. కిగాలీ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినందుకు చంద్రభూషణ్‌కు భాగస్వామ్య అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అనిల్ దవే, చంద్ర భూషణ్‌లకు ఓజోన్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎందుకు : పర్యావరణ కార్యక్రమంలో భాగంగా

రాజ్‌కుమార్ కు ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డు
భారత్ తరఫున ఆస్కార్‌కు నామినేట్ అయిన న్యూటన్ చిత్రానికి మరో గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డుల (ఏపీఎస్‌ఏ) కార్యక్రమంలో ఈ చిత్రం రెండు అవార్డులను దక్కించుకుంది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్‌రావు ఉత్తమ నటుడిగా, మయాంక్ తివారీ, అమిత్ మసూర్కర్‌లు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలుగా ఎంపికయ్యారు.
హీరో రాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించిన న్యూటన్ ఆస్కార్ రేసులో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఎంపికైంది. న్యూటన్ చిత్రంను చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ కథతో బ్లాక్ కామెడీ తరహా సినిమాగా తీశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావుకు ఉత్తమ నటుడి అవార్డు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్
ఎందుకు : న్యూటన్ చిత్రంలో నటనకు గాను

డా. రామారెడ్డికి అమిత్ బోరా ఆరేషన్ అవార్డు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్యులు, బీసీరాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డికి ‘డాక్టర్ అమిత్ బోరా ఆరేషన్ అవార్డు’ లభించింది. 2017 ఏడాదికిగానూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సైకియాట్రి(ఐఏపీపీ) ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. నవంబర్ 23 నుంచి 26 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఐఏపీపీ 18వ వార్షిక సమావేశాల్లో రామారెడ్డికి అవార్డును ప్రదానం చేశారు.
అకాల మరణం పొందిన యువ మానసిక వైద్యుడు అమిత్ బోరా పేరు మీదుగా ఆయన తల్లిదండ్రులు ప్రతి ఏడాది ఈ అవార్డును అందిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్టర్ అమిత్ బోరా ఆరేషన్ అవార్డు
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : డాక్టర్ కర్రి రామారెడ్డి

అమితాబ్ బచ్చన్‌కు పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Current Affairs
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నవంబర్ 16న ప్రకటించింది. నవంబర్ 20 - 28 వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
అమితాబ్ బచ్చన్ ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 190కిపైగా చిత్రాల్లో నటించారు. 4 జాతీయ అవార్డులు, 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమితాబ్ బచ్చన్‌కు పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఐఎఫ్‌ఎఫ్‌ఐ, గోవా

రానా, దీపికాలకు సోషల్ మీడియా అవార్డులు
దేశంలో తొలి సోషల్ మీడియా సదస్సు, సోషల్ మీడియా అవార్డుల ప్రదానోత్సవం - SMSA నవంబర్ 18, 19 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగింది. సౌత్ ఇండియా సోషల్ మీడియా బెస్ట్ హీరోగా దగ్గుబాటి రానాకు, సోషల్ మీడియా బెస్ట్ హీరోయిన్‌గా దీపికా పదుకునేకు పురస్కారాలు లభించాయి. సోషల్ మీడియాలో సంగీత సంచలనం అవార్డుని యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్‌కు దక్కింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఈ అవార్డులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విబ్రీ మీడియా సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రానా, దీపికా పదుకునే, అనిరుధ్‌లకు సోషల్ మీడియా అవార్డులు
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విబ్రీ మీడియా
ఎక్కడ : అమరావతి

మన్మోహన్‌సింగ్‌కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్.. ‘ఇందిరాగాంధీ శాంతి పురస్కారం- 2017’కి ఎంపిక య్యారు. పదేళ్ల పాటు (2004 నుంచి 2014 వరకు) ప్రధానిగా సేవలందించి శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి ద్వారా మన దేశాన్ని ప్రపంచంలో ఓ స్థాయిలో నిలబెట్టినందుకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టు నవంబర్ 19న ప్రకటించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని అంతర్జాతీయ న్యాయ నిర్ణేతల మండలి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ పురస్కారాన్ని ఇందిరాగాంధీ ట్రస్టు 1986లో ఏర్పాటు చేసింది. అవార్డు కింద రూ.25 లక్షలు, ప్రశంసాపత్రం అందజేస్తారు.

శ్రీలంక రచయితకు డీఎస్‌సీ ప్రైజ్
దక్షిణాసియా సాహిత్యానికిచ్చే డీఎస్‌సీ ప్రైజ్ 2017 సంవత్సరానికి శ్రీలంక రచయిత అనుక్ అరుద్ ప్రగసామ్‌కు లభించింది. ఆయన రాసిన ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్రీఫ్ మ్యారేజ్’కు ఈ బహుమతి దక్కింది. అవార్డు కింద 25 వేల డాలర్ల నగదును అందజేస్తారు.

కృష్ణ సోబతీకి జ్ఞానపీఠ్ పురస్కారం
Current Affairs
ప్రముఖ హిందీ సాహితీవేత్త కృష్ణ సోబతీ(92) ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం 2017 కు ఎంపికైంది. ఆమె ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న గుజరాత్‌లో జన్మించారు. ప్రయోగాత్మక, విలక్షణ శైలి కృష్ణ సోబతి ప్రత్యేకత. ఆమె రాసిన ‘దార్ సే బిఛుడీ, మిత్రో మర్జానీ, జిందగీనామా’ తదితర రచనలు ప్రఖ్యాతి గాంచాయి. దేశ విభజన, స్త్రీ, పురుష సంబంధాలు, మారుతున్న భారతీయ సమాజ స్థితిగతులు, పతనమవుతున్న మానవ విలువలు వంటివి ఆమె రచనల్లో ముఖ్యంగా కన్పిస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జ్ఞాన్‌పీఠ్ పురస్కారం 2017
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : కృష్ణ సోబతీ
ఎందుకు : హిందీ సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు

బ్రహ్మానందం, జగపతిబాబులకు జీవన సాఫల్య పురస్కారం
తెలుగు నటులు బ్రహ్మానందం, జగపతిబాబుకు ఢిల్లీ తెలుగు అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 5న అకాడమీ 29వ వార్షికోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వారికి అవార్డులు ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రహ్మానందం, జగపతిబాబులకు జీవన సాఫల్య పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఢిల్లీ తెలుగు అకాడమీ

పవర్‌గ్రిడ్‌కు ఇన్‌ఫ్రా అవార్డు
ప్రభుత్వ రంగ విద్యుత్తు కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు పవర్ ట్రాన్స్‌మిషన్ రంగంలో 2017 సంవత్సరానికి గాను డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇన్‌ఫ్రా అవార్డు లభించింది. నవంబర్ 6న ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పవర్ గ్రిడ్ ఈడీ వి.కె. ఖరే, జీఎమ్(హెచ్‌ఆర్) అనిల్ గైక్వాడ్, ఏజీఎమ్ అజయ్ హొలాని ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇన్‌ఫ్రా అవార్డు 2017
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : పవర్‌గ్రిడ్ కార్పోరేషన్
Published date : 15 Nov 2017 11:37AM

Photo Stories