Skip to main content

National Panchayati Raj Day: జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

Panchayat Awards

ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను అవార్డులను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక’ పాలన ఆధారంగా ప్రకటించిన ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 16 అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 11 గ్రామ పంచాయతీలు, నాలుగు మండల పరిషత్‌లు, ఒక జిల్లా పరిషత్‌కు అవార్డులు దక్కాయి.

ఏపీ గెలుచుకున్న అవార్డుల వివరాలు ఇలా..
దీనదయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వస్తీకరణ్‌ పురస్కారాలు: 

  • ఉత్తమ జిల్లా పరిషత్‌ (1): తూర్పుగోదావరి
  • ఉత్తమ మండల పరిషత్‌లు (4): పెద్దమండ్యం(ఉమ్మడి చిత్తూరు జిల్లా), సబ్బవరం (ఉమ్మడి విశాఖపట్నం జిల్లా), మద్దికెర తూర్పు (ఉమ్మడి కర్నూలు జిల్లా), రేగిడి ఆమదాలవలస (ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా)
  • ఉత్తమ గ్రామ పంచాయతీలు (8): మంగళంపేట (ఉమ్మడి చిత్తూరు జిల్లా), మినుములూరు (ఉమ్మడి విశాఖపట్నం జిల్లా), కలిగిరి, అనుమ సముద్రం (ఉమ్మడి నెల్లూరు జిల్లా), ఏడిద (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా), అనంతపురం రూరల్‌ (అనంతపురం జిల్లా), చేబ్రోలు, దమ్మనవారిపాలెం (ఉమ్మడి గుంటూరు జిల్లా)

ప్రత్యేక కేటగిరీలో అవార్డులు గెలుచుకున్న గ్రామ పంచాయతీలు

  1. గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ఉత్తమ గ్రామ పంచాయతీ: మాబగం (ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా)
  2. చైల్డ్‌ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ: యెక్కోలు (ఉమ్మడి నెల్లూరు జిల్లా)
  3. నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామసభ పురస్కారం: కొత్త మూలపేట (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా)

Grammy Awards 2022: గ్రామీ అవార్డుల విజేతల పూర్తి జాబితా..

73వ రాజ్యాంగ సవరణ..
గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన రోజు ఏప్రిల్ 24వ తేదీన ప్రభుత్వాలు ఏటా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఆయా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన ప్రజాప్రతినిధులు/అధికారులకు ఏప్రిల్ 24న అవార్డులు అందజేస్తారు. జమ్మూకశ్మీర్‌లోని పాలి గ్రామ పంచాయతీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమంలో ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఈ అవార్డులు బహూకరిస్తారు. ఈ అవార్డుల కింద కేంద్రం జిల్లా పరిషత్‌కు రూ.50 లక్షలు, ఒక్కో మండల పరిషత్‌కు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 నుంచి రూ.16 లక్షలు అందజేయనుంది.

Tomb of Sand: అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌కి ఎంపికైన తొలి హిందీ నవల?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 13 Apr 2022 02:13PM

Photo Stories