Skip to main content

National Medal of Technology and Innovation Award: ఇద్దరు భారతీయ సంతతి శాస్త్రవేత్తలకు అమెరికా అత్యున్నత అవార్డులు

ఇద్దరు భారతీయ సంతతి శాస్త్రవేత్తలకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అశోక్‌ గాడ్గిల్‌కు నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ అవార్డు దక్కింది.
National Medal of Technology and Innovation Award
National Medal of Technology and Innovation Award

అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ఇదే కావడం విశేషం. మరో భారత సంతతి శాస్త్రవేత్త సుబ్రా సురేశ్‌కు నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ పురస్కారం లభించింది. అక్టోబర్‌ 24న ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ పతకాలను అందజేశారు. అశోక్‌ గాడ్గిల్‌ ప్రస్తుతం కాలిఫోర్నియా వర్సిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. లారెన్స్‌ బెర్కిలీ నేషనల్‌ ల్యాబ్‌లో సీనియర్‌ సైంటిస్టుగా ఉన్నారు.

Harvard Global Leadership Award: హార్వర్డ్‌ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు అందుకున్న సీజేఐ

సుస్థిర అభివృద్ధి రంగంలో ఆయన ఆవిష్కకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. శుద్ధ నీరు, ఇంధనం, శానిటేషన్‌ డెవలప్మెంట్‌కు అవసరమైన సమర్థ సాంకేతిక విధానాలను ఆయన డెవలప్‌ చేశారు. మరో శాస్త్రవేత్త సుబ్రా సురేశ్‌.. అమెరికాలో బయో ఇంజినీర్‌గా చేస్తున్నారు. గతంలో మాసాచుసెట్స్‌ టెక్నానాలజీ ఇన్స్‌టిట్యూట్‌లో డీన్‌గా చేశారు. ఇంజినీరింగ్, ఫిజికల్‌ సైన్సెస్, లైఫ్‌ సెన్సెస్, మెడిసిన్‌ రంగాల్లో పరిశోధన చేశారు. ఎంఐటీలో ఓ విభాగానికి అధిపతిగా పనిచేసిన తొలి ఆసియా వ్యక్తిగా సురేశ్‌ రికార్డు సృష్టించాడు.

Mahsa Amini awarded Sakharov human rights prize: మహ్సా అమినికి సఖరోవ్‌ పురస్కారం

Published date : 30 Oct 2023 03:53PM

Photo Stories