మార్చి 2019 అవార్డ్స్
Sakshi Education
16ఏళ్ల బాలుడికి శౌర్యచక్ర ప్రదానం
ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడిన 16ఏళ్ల బాలుడు ఇర్ఫాన్ రంజాన్ షేక్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 19న ఢిల్లీలో శౌర్యచక్ర పతకాన్ని ప్రదానం చేశారు. చిన్నవయసులోనే అతడు చూపిన అసమాన ధైర్యసాహసాలకుగాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2017 అక్టోబరు 16న కశ్మీర్‌లోని ఇర్ఫాన్ ఇంటిని ముగ్గురు ఉగ్రవాదులు చుట్టుముట్టారు. మాజీ గ్రామ సర్పంచ్ అయిన తండ్రితోపాటు ఇతర కుటుంబ సభ్యులను కాపాడుకొనేందుకు ఇర్ఫాన్ వారితో పోరాడాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇర్ఫాన్ రంజాన్ షేక్‌కు శౌర్యచక్ర ప్రదానం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అసమాన ధైర్యసాహసాలకుగాను
తెలంగాణ టూరిజం ఫిల్మ్‌కు జపాన్ అవార్డు
తెలంగాణ పర్యాటక అందాలకు ‘జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్’ఫిదా అయింది. ఒసాకా నగరంలో మార్చి 13, 14 తేదీల్లో జరిగిన వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘థీమ్ సాంగ్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్’కు కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు దక్కింది. మార్చి 14న జరిగిన ముగింపు వేడుకల్లో డాక్యుమెంటరీ ఫిల్మ్ డెరైక్టర్ దూలం సత్యనారాయణ ఈ అవార్డు అందుకున్నారు. తెలంగాణలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాల అందాలతో రూపొందించిన ఈ పర్యాటక చిత్రం బెస్ట్ ఫిల్మ్ ఇన్ కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు దక్కించుకుంది. తెలంగాణ థీమ్ సాంగ్ చిత్రానికి అవార్డ్ రావడంపై పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి బుర్రా వెంకటేశం హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు తెలంగాణ సొంతమని, ఈ అవార్డుతో ప్రపంచదేశాల నుంచి తెలంగాణకు వచ్చే పర్యాటకులు సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు దూలం సత్యనారాయణకు అభినందనలు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘థీమ్ సాంగ్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్’కు కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : దూలం సత్యనారాయణ
ఎక్కడ : జపాన్ (ఒసాకా నగరం)
ఎందుకు : తెలంగాణ పర్యాటక అందాలకు
16 ఏళ్లకే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన బాలిక
నోబెల్ శాంతి బహుమతి కోసం ఎవరెవరి పేర్లో చర్చకు వస్తుంటే... అనూహ్యంగా స్వీడన్ దేశానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక నామినేట్ అయి్య చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా నోబెల్ శాంతి బహుమతి అందుకున్నవారిలో మలాల(17 ఏళ్లకే) అత్యంత పిన్నవయస్కురాలు. కానీ అంతకంటే ఏడాది తక్కువ వయసున్న గ్రెటా థంబెర్గ్.. పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికిగాను నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. ఒకవేళ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రెటాకే దక్కితే.. మలాల రికార్డును అధిగమిస్తుంది.
ఆలోచింపజేసే ప్రసంగాలు..: పర్యావరణ మార్పులపై తన ప్రసంగాలతో యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించి పర్యావరణ ఉద్యమకారిణిగా గ్రెటా థంబెర్గ్ గుర్తింపు పొందింది. ‘మీ ఆకాంక్షలు నాకు అక్కర్లేదు. మీ ఆశయాలూ నాకు అక్కర్లేదు. నాకు కావాలసిందల్లా మీరు ఆందోళన చెందడమే. అదీ ఎంతగా అంటే.. మీ ఇల్లు మంటల్లో చిక్కుకున్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో.. అంతగా పర్యావరణం గురించి కూడా మీరు కంగారు పడాలంటూ ఆలోచింపజేసేలా చేసే ప్రసంగం ఎన్నో చోట్ల పర్యావరణ ఉద్యమాలకు ఊపిరి పోసింది.
మోదీజీ మాటలు కాదు.. చేతల్లో చూపండి..
పర్యావరణ మార్పులపై చర్య తీసుకోవాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి గ్రెటా గత నెలలో ఓ వీడియో సందేశాన్ని కూడా పంపింది. ఆ సందేశంలో.. ‘మోదీ జీ పర్యావరణ మార్పులపై ప్రసంగాలకే పరిమితం కాకుండా కార్యాచరణ మొదలుపెట్టాలంటూ సూచించింది.
టైమ్స్‌లో చోటు..: ‘టైమ్స్ అత్యంత ప్రభావిత చిన్నారుల జాబితా-2018’లో కూడా గ్రెటాకు చోటుదక్కింది. పర్యావరణ మార్పులపై నాయకులు స్పందించాలంటూ 2018 ఆగస్టులో స్వీడిష్ పార్లమెంటు ముందు విద్యార్థులతో కలిసి ధర్నా కూడా చేపట్టింది. పర్యావరణ మార్పులపై నాయకులు చర్యలు తీసుకునేలా విద్యార్థులంతా పోరాడాలని పిలుపునిచ్చింది. అలాగే గత డిసెంబరులో ఐరాసలో వాతావరణ మార్పులపై అద్భుతమైన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది. జనవరిలో దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక వేదికపైనా తన గళాన్ని వినిపించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 16 ఏళ్లకే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన స్వీడన్ బాలిక
ఎవరు: గ్రెటా థంబెర్గ్
ఎక్కడ : స్టాక్‌హోమ్ (స్వీడన్)
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికిగాను
ప్రియాంక దూబేకు చమేలీదేవి జైన్ అవార్డు
పముఖ పాత్రికేయురాలు, బీబీసీ ఢిల్లీ బ్యూరో ద్విభాషా వ్యాఖ్యాత ప్రియాంక దూబే ప్రతిష్టాత్మక చమేలీదేవి జైన్ అవార్డు-2018కు ఎంపికయ్యారు. ఢిల్లీలో మార్చి 9న నిర్వహించనున్న కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ప్రియాంకకు ఈ అవార్డు దక్కింది. పాత్రికేయంలో అసమాన ప్రతిభ చూపిన మహిళలకు గత 37 ఏళ్లుగా స్వాతంత్య్ర సమరయోధురాలైన చమేలిదేవి జైన్ పేరిట అవార్డును బహూకరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చమేలీదేవి జైన్ అవార్డు-2018
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : ప్రియాంక దూబే
ఎందుకు : పరిశోధనాత్మక జర్నలిజంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు
రాధా దేవి, శాంతికి నారీ శక్తి పుర స్కారం
టీటీడీ మహిళా క్షురకుల సంఘం అధ్యక్షురాలు కగ్గనపల్లి రాధా దేవి, ఇస్రో మహిళా శాస్త్రవేత్త మున్నుస్వామి శాంతిలకు నారీ శక్తి పురస్కారం లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీరికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. మహిళా సాధికారతకు, లింగ సమానత్వానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా వీరికి ఈ అవార్డు దక్కింది. 2018 ఏడాదికి గానూ మొత్తంగా మహిళా సాధికారతకు విశేష సేవలందిస్తున్న 41 మందికి, 3 సంస్థలకు నారీ శక్తి పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నారీ శక్తి పురస్కారం-2018
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : కగ్గనపల్లి రాధా దేవి, మున్నుస్వామి శాంతి
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : మహిళా సాధికారతకు, లింగ సమానత్వానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కోలాటం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మార్చి 8న నిర్వహించిన సామూహిక మహిళా కోలాట ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయ గ్రౌండ్‌లో 714 మందితో ఈ సామూహిక కోలాటం నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్, మెడల్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు చీఫ్ కోఆర్డినేటర్ రంగజ్యోతి అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోలాట ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
ఎప్పుడు : మార్చి 8
ఎక్కడ : గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ
సింగరేణికి ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు
సింగరేణి సంస్థకు ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు-2018 లభించింది. ముంబైలో బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మార్చి 8న నిర్వహించిన కార్యక్రమంలో సీఈవో హేమంత్ కౌషిక్ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌కు అందజేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్‌ఫైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఏటా ఈ అవార్డును అందిస్తోంది. దేశంలోని కంపెనీల పనితీరును, వృద్ధిని స్వచ్ఛందంగా అధ్యయనం చేసి అత్యుత్తమ కంపెనీని ఇండియాస్ బెస్ట్ కంపెనీగా ఎంపిక చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు-2018
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : సింగరేణి సంస్థ
తెలంగాణకు ఇండియన్ స్టాండర్స్ అవార్డు
తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖకు ప్రతిష్టాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అవార్డు లభించింది. టీఎస్‌ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేసినందుకుగాను ఈ అవార్డు దక్కింది. అలాగే నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌సిటీ, నిజామాబాద్ కార్యాలయాలకు కూడా ఈ గుర్తింపు దక్కింది. నాణ్యత నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లెసైన్స్ ను పొందిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అవార్డు
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖ
ఎందుకు : టీఎస్‌ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేసినందుకు
ప్రజాపతి త్రివేదికి హ్యారీ హాట్రీ అవార్డు
లండన్‌లోని కామన్వెల్త్ సెక్రటేరియట్‌లో సీనియర్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న భారతీయుడు ప్రజాపతి త్రివేదికి ప్రతిష్టాత్మక ‘హ్యారీ హాట్రీ డిస్టింగ్యూష్‌డ్ పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ అవార్డు-2019 లభించింది. అమెరికాలోని వాషింగ్టన్‌లో మార్చి 10న జరిగిన కార్యక్రమంలో సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ (సీఏపీ), అమెరికన్ సొసైటీ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏఎస్‌పీఏ) ఈ అవార్డును ప్రజాపతికి ప్రదానం చేశాయి. దీంతో ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడిగా ప్రజాపతి నిలిచారు. 2009-14 మధ్య కాలంలో ప్రజాపతి భారత పీఎంవోలో శాశ్వత కార్యదర్శిగా పనిచేశారు. హ్యారీ హాట్రీ అవార్డును ప్రతి ఏడాదీ ప్రజాపాలన విభాగంలో గణనీయ మార్పులు తెచ్చేందుకు కృషి చేసే వారికి ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హ్యారీ హాట్రీ డిస్టింగ్యూష్‌డ్ పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ అవార్డు-2019
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : ప్రజాపతి త్రివేది
ఎందుకు : ప్రజాపాలన విభాగంలో విశేష కృషికిగాను
పద్మ పురస్కారాల ప్రదానం
2019 ఏడాదికిగానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 11న రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగింది. మొత్తం 112 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలు ప్రకటించగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా 47 మందికి ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిన వారికి మార్చి 16న అవార్డులను అందజేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ‘రైతు నేస్తం’ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరావు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పద్మ పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, ఢిల్లీ
లిమ్కా బుక్స్‌లో మేఘా ఇంజనీరింగ్
మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్‌తోపాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. విద్యుత్ సబ్ స్టేషన్‌ను రికార్డు సమయంలో ఏడు నెలల్లోపే నిర్మించడంతో సంస్థకు ఈ గౌరవం దక్కింది. మరోవైపు ఉత్తమ పనితీరు కనబరిచినందుకుగాను మేఘా ఇంజనీరింగ్‌ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ‘బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు’తో సత్కరించింది. అనంతపురం జిల్లా నంబూలపూలకుంట వద్ద 400/220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని 2015 సెప్టెంబరు 25న ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ 2016 ఏప్రిల్ 25న ప్రారంభానికి సిద్ధం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్‌లో చోటు
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ఎందుకు : విద్యుత్ సబ్ స్టేషన్‌ను రికార్డు సమయంలో నిర్మించినందుకు
ఏఎన్‌యూ పరిశోధకురాలికి జాతీయ స్థాయి అవార్డు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్‌ట్స కళాశాల సోషియాలజీ అండ్ సోషల్‌వర్క్ విభాగ పరిశోధకురాలు ఎం.స్వర్ణలతకు భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డు లభించింది. న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ (జీఈపీఆర్‌ఏ) సంస్థ ఇటీవల బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ప్రణాళికా శాఖ మాజీ మంత్రి రాజశేఖరన్ చేతులమీదుగా స్వర్ణలత ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణలతను ఏఎన్‌యూ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ కె.రామ్‌జీ అభినందించారు. రానున్న రోజుల్లో పరిశోధనారంగంలో మంచి ప్రతిభ కనబరిచి మరిన్ని అవార్డులు సాధించాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎం.స్వర్ణలతకు భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డు
ఎవరు : ఎం.స్వర్ణలత
ఎక్కడ : బెంగళూరులో
సినీనటి శారదకు కలైమామణి అవార్డు
సినీనటి శారదకు కలైమామణి-2018 అవార్డు లభించింది. ఈ మేరకు 2018 సంవత్సరానికిగాను కలైమామణి అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 28న ప్రకటించింది. శారదతోపాటు కాంచన, కుట్టి పద్మినికి ఈ అవార్డు దక్కింది. అలాగే నటులు సూర్య, కార్తీ, విజయ్‌సేతుపతి, ప్రభుదేవా, విజయ్‌ఆంటోని, శశికుమార్, సంతానం, సూరి, నటి ప్రియమణి, నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు హరిలకు కూడా అవార్డులు దక్కాయి. మరోవైపు ప్రముఖ నటీమణి వైజయంతిమాల బాలి.. బాలసరస్వతి అవార్డుకు ఎంపికయ్యారు. కళారంగంలో విశేష సేవలు అందించినందుకుగానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కలైమామణి-2018 అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : సినీనటి శారద
ఎక్కడ : తమిళనాడు
ఎందుకు : కళారంగంలో విశేష సేవలు అందించినందుకుగానూ
ఏసీపీ రంగారావుకు ఉత్తమ దర్యాప్తు అధికారి అవార్డు
హైదరాబాద్ పోలీసు విభాగంలోని ఏసీపీ ఎస్.రంగారావుకు ఉత్తమ దర్యాప్తు అధికారి అవార్డు లభించింది. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మార్చి 1న తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న రంగారావు బేగంపేట ఏసీపీగా ఉండగా 2016లో తొమ్మిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు దర్యాప్తునకు ఈ అవార్డు దక్కింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుసహా అన్ని దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధికారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దర్యాప్తు అధికారులకు ప్రత్యేక అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి అవార్డును రంగారావు గెల్చుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తమ దర్యాప్తు అధికారి అవార్డు
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : ఏసీపీ ఎస్.రంగారావు
డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డికి మిస్సైల్ అవార్డు
దేశ రక్షణ వ్యవస్థలకు కీలకమైన నావిగేషన్ వ్యవస్థలు అందించిన శాస్త్రవేత్త..డీ ఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డికి ‘‘2019 మిస్సైల్ సిస్టమ్స్’’అవార్డు లభించింది. ఈ మేరకు ద అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ అో్టన్రాటిక్స్ (ఏఐఏఏ) మార్చి 2న ప్రకటించింది. క్షిపణి వ్యవస్థను అభివృద్ధి, తయారీల్లో అత్యున్నత నైపుణ్యం కనబరిచే వారికి అందించే ఈ అవార్డును రోండెల్ జే.విల్సన్‌తో కలసి సతీశ్‌రెడ్డి పంచుకోనున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో మే 7 నుంచి 9 వరకు జరిగే డిఫెన్స్ ఫోరం కార్యక్రమంలో రోండెల్ ఈ అవార్డు అందుకుంటారని.. సతీశ్‌రెడ్డికి భారత్‌లోనే అంద జేస్తామని ఏఐఏఏ తెలిపింది. దీంతో ఏఐఏఏ అవార్డు అందుకోనున్న తొలి భారతీయుడిగా సతీశ్‌రెడ్డి గుర్తింపు పొందనున్నాడు. రెండేళ్లకు ఒకసారి అందించే ఈ అత్యున్నత అవార్డును ఇప్పటివరకూ అమెరికన్లకు మాత్రమే అందిస్తుండగా.. తొలిసారి ఇతర దేశపు నిపుణుడికి ఇవ్వటం విశేషం.
క్షిపణి నావిగేషన్ వ్యవస్థల రూపశిల్పి
భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన క్షిపణులకు నావిగేషన్ వ్యవస్థలను డిజైన్ చేయడంతోపాటు తయారీకి అవసరమైన అనేక పరికరాలను పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే అభివృద్ధి చేసుకునేందుకు సతీశ్‌రెడ్డి కృషి చేసిన విషయం తెలిసిందే. అగ్ని, పృథ్వీ, నాగ్ క్షిపణులతోపాటు అనేక ఇతర వ్యూహాత్మక క్షిపణులకు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలను అందించిన ఘనత సతీశ్ రెడ్డి సొంతం. రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్, రాయల్ ఏరోనాటికల్ సొసైటీ, అకాడమీ ఆఫ్ నావిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్ (రష్యా) సభ్యత్వం లభించిన తొలి భారతీయుడిగా సతీశ్‌రెడ్డి గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019 మిస్సైల్ సిస్టమ్స్ అవార్డు
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : డీ ఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి
ఎందుకు : క్షిపణి వ్యవస్థను అభివృద్ధి, తయారీల్లో అత్యున్నత నైపుణ్యం కనబరిచినందుకు
కుంభమేళాకి గిన్నిస్ రికార్డు
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన గిన్నిస్ రికార్డు బృందం ప్రయాగ్‌రాజ్‌లో మార్చి 3న పర్యటించింది. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు, వారందరికీ సరైన పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన, భారీ ఎత్తున పెయింటింగ్‌సను ప్రదర్శించినందుకు గాను కుంభమేళాకు ఈ రికార్డును దక్కింది. ఇప్పటి వరకు 22 కోట్ల మందికి పైగా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుంభమేళాకి గిన్నిస్ రికార్డుల్లో స్థానం
ఎప్పుడు : మార్చి 3
ఎక్కడ : ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
సీఐఎస్‌ఎఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు
సింగిల్ లైన్ సైకిల్ పరేడ్‌లో సీఐఎస్‌ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) మార్చి 3న గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఒకే వరుసలో 1,327 మంది భద్రతా సిబ్బంది సైకిళ్లతో పరేడ్ నిర్వహించి ఈ ఘనతను సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఎక్స్‌ప్రెస్ వేలో నిర్వహించిన ఈ పరేడ్ 3.2 కిలోమీటర్ల మేర సాగింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఒకే వరుసలో 1,235 సైకిళ్లతో హుబ్బాల్లి సైకిల్ క్లబ్ ఆఫ్ ఇండియా పేరున ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఐఎస్‌ఎఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు
ఎప్పుడు : మార్చి 3
ఎక్కడ : నోయిడా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : ఒకే వరుసలో 1,327 మంది భద్రతా సిబ్బంది సైకిళ్లతో పరేడ్ నిర్వహించి నిర్వహించినందుకు
ముంబై విమానాశ్రయానికి అవార్డు
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి ఉత్తమ విమానాశ్రయ అవార్డు లభించింది. జీవీకే నిర్వహణలో ఉన్న ముంబై విమానాశ్రయం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏటా 4 కోట్లకుపైగా ప్రయాణికులకు సేవలందిస్తుంది. ఇండోనేషియాలోని బాలిలో 2019, సెప్టెంబర్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఉత్తమ విమానాశ్రయ అవార్డు
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర

Published date : 13 Mar 2019 05:26PM