జనవరి 2020 అవార్డ్స్
Sakshi Education
టీ-చిట్స్ వెబ్‌సైట్‌కు ఈ-గవర్నెన్స్ పురస్కారం
చిట్‌ఫండ్ వ్యాపారాన్ని నియంత్రించేందుకు అత్యాధునిక బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘టీ-చిట్స్’ వెబ్‌సైట్‌కు జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డు లభించింది. 2020 ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ముంబైలో జరగనున్న 23వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహిస్తోన్న టీ-చిట్స్‌కు బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టులో భాగంగా రూపకల్పన చేశారు. టీ-హబ్ కేంద్రంగా పనిచేస్తున్న చిట్‌మాంక్స్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. బ్లాక్‌చైన్ పరిజ్ఞానం ఆధారంగా చిట్‌ఫండ్ లావాదేవీల సమాచారానికి భద్రత చేకూరిందని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : టీ-చిట్స్ వెబ్‌సైట్
తెలంగాణ యువకుడికి యంగ్ సైంటిస్టు అవార్డు
పత్తిలో అధిక దిగుబడి సాధించేందుకు చేసిన పరిశోధనకు గాను తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం దుబ్బతండాకు చెందిన బానోతు భిక్షపతికి ‘యంగ్ సైంటిస్టు మెరిట్ అకడమిక్ అవార్డు’ లభించింది. జాతీయ పత్తి పరిశోధన అభివృద్ధి సంస్థ, హర్యానాకు చెందిన ఇస్సార్ సంస్థల ఆధ్వర్యంలో ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో 2020, జనవరి 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ సదస్సులో భిక్షపతికి ఈ అవార్డు అందజేశారు. ఎల్‌హెచ్‌డీపీ-1 అనే పత్తి రకం అధిక సేంద్రియ పద్ధతిలో ఎకరానికి 64 వేల మొక్కలు నాటి 20 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చేలా పరిశోధన చేసినందుకు భిక్షపతికి ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యంగ్ సైంటిస్టు మెరిట్ అకడమిక్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : బానోతు భిక్షపతి
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిషా
ఎందుకు : పత్తిలో అధిక దిగుబడి సాధించేందుకు చేసిన పరిశోధనకు గాను
పక్షి ప్రేమికుడు కార్తీక్‌కు అంతర్జాతీయ అవార్డు
తిరుపతికి చెందిన పక్షి ప్రేమికుడు కార్తీక్ సాయికి అంతర్జాతీయ అవార్డు లభించింది. మధ్య తూర్పు దేశమైన సిప్రస్‌కు చెందిన సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ సంస్థ ఆయనకు ‘గ్రాండ్ ప్రోగ్రెస్ అవారు’్డ ప్రకటించింది. హైదరాబాద్‌లో జనవరి 26న నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు. క్తారీక్ శేషాచలం అడవుల్లో 169 రకాల పక్షుల ఫొటోలను తన కెమెరాలో బంధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పక్షి ప్రేమికుడు కార్తీక్ సాయికి గ్రాండ్ ప్రోగ్రెస్ అవార్డు
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ సంస్థ
ఎక్కడ : హైదరాబాద్
పర్యావరణవేత్త సుఖ్‌దేవ్‌కు టైలర్ పురస్కారం
ప్రముఖ భారత పర్యావరణవేత్త, యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌ఈపీ) రాయబారి పవన్ సుఖ్‌దేవ్‌ను ప్రతిష్ఠాత్మక ‘టైలర్ పురస్కారం-2020’ వరించింది. పర్యావరణ రంగంలో నోబెల్‌గా పరిగణించే ఈ పురస్కారాన్ని ప్రఖ్యాత పర్యావరణ బయాలజిస్ట్ గ్రెట్చెన్ డైలీతో కలసి సుఖ్‌దేవ్ సంయుక్తంగా అందకోనున్నారు. సుఖ్‌దేవ్ చేపట్టిన ‘గ్రీన్ ఎకానమీ’ఉద్యమానికి గాను ఈ అవార్డు దక్కింది. పర్యావరణ క్షీణత, దాని ఆర్థిక పర్యవసనాలను కార్పొరేట్లు, రాజకీయ నిర్ణయాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు సుఖ్‌దేవ్ విశేష కృషి చేశారు. 2020, మే 1న ఈ పురస్కారాన్ని సుఖ్‌దేవ్, గ్రెట్చెన్ స్వీకరించనున్నారు. ఈ అవార్డు కింద బంగారు పతకాలతో పాటు సుమారు రూ.కోటిన్నర నగదు బహుమతిని వీరు పంచుకుంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టెలర్ పురస్కారం-2020కు ఎంపిక
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : పవన్ సుఖ్‌దేవ్
ఎందుకు : ‘గ్రీన్ ఎకానమీ’ఉద్యమానికి గాను
సింగరేణి సీఎండీకి భారతీయ మహంతం వికాస్ పురస్కారం
ఆసియాలో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు ఇచ్చే భారతీయ మహంతం వికాస్ పురస్కారానికి సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఎంపికయ్యారు. థాయ్‌లాండ్‌కు చెందిన అంతర్జాతీయ పత్రిక ఆసియా వన్, యూఆర్‌ఎస్ మీడియా ఇంటర్నేషనల్ గ్రూప్ 2019-20 సంవత్సరానికి గాను సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ‘ద లీడర్’పేరుతో ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. బ్యాంకాక్‌లో ఫిబ్రవరి 7న జరగనున్న 13వ ఏసియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం సదస్సులో ఈ పురస్కారాన్ని బహూకరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సింగరేణి సీఎండీకి భారతీయ మహంతం వికాస్ పురస్కారం
ఎప్పుడు: ఫిబ్రవరి 7, 2019
ఎవరు: ఎన్.శ్రీధర్
ఎక్కడ: బ్యాంకాక్
ఎందుకు: ఆసియాలో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు...
తెలంగాణ పోలీస్ శాఖకు సీఎస్‌ఐ పురస్కారం
ప్రముఖ సంస్థ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు ఈ-గవర్నెన్స్ ఎక్సలెన్సీ-2019 అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును భువనేశ్వర్‌లో జనవరి 17న జరిగిన ప్రత్యేక సమావేశంలో డీజీపీ కార్యాలయ ప్రతినిధి ఐటీ విభాగం డీఎస్పీ వెంకట్‌రెడ్డికి ఒడిశా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, క్రీడా మంత్రి తుషార్ కాంతి బెహ్రా ప్రదానం చేశారు. ‘హాక్ ఐ’ యాప్‌ను రూపొందించి మహిళలు, పిల్లల రక్షణకు చేపట్టిన చర్యలకు గాను తెలంగాణ పోలీస్ శాఖకు ఈ అవార్డు దక్కింది. హాక్ ఐను ప్యాసింజర్ క్యాబ్ సర్వీసులైన ఓలా, ఉబర్ తదితర ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల మొబైల్ యాప్‌లకు అనుసంధానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఎస్‌ఐ ఈ-గవర్నెన్స్ ఎక్సలెన్సీ-2019 అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : తెలంగాణ పోలీస్ శాఖ
ఎందుకు : హాక్ ఐ యాప్‌ను రూపొందించి మహిళలు, పిల్లల రక్షణకు చేపట్టిన చర్యలకు గాను
కిరణ్ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం
బయోకాన్ వ్యవస్థపాపకురాలు,ఎండీ కిరణ్ మజుందార్ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ లభించింది. బెంగళూరులోని లీలా ప్యాలెస్‌లో జనవరి 17న జరిగిన కార్యక్రమంలో భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ హరిందర్ సింధు ఈ అవార్డును కిరణ్‌కు అందజేశారు. దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వాణిజ్య, విద్యాపర సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు గాను కిరణ్‌కు ఈ అవార్డు దక్కింది.
ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారాన్ని 1975, ఫిబ్రవరి 14న ది క్వీన్ ప్రారంభించారు. ఆస్ట్రేలియాలో చదివిన కిరణ్ షా ఈ పురస్కారాన్ని స్వీకరించిన భారతీయుల్లో నాల్గవ వారు. కిరణ్ కంటే ముందు భారత్ నుంచి మదర్ థెరిస్సా, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం విజేత
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : కిరణ్ మజుందార్-షా
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వాణిజ్య, విద్యాపర సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు
49 మందికి బాల్ శక్తి అవార్డుల ప్రదానం
వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 49 మంది చిన్నారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘బాల్ శక్తి’అవార్డులను ప్రదానం చేశారు. 2020 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కోవింద్ అందజేశారు. అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రాన్ని అందించారు. 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలల్లో ఆవిష్కరణలు, సామాజిక సేవ, క్రీడలు, కళలు, సంస్కృతి తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందిస్తారు.
దొంగల బారి నుంచి రష్యా వాసిని కాపాడిన ఇషాన్ శర్మ.. చిన్న వయసులో సైద్ధాంతిక రచయితగా రికార్డుల్లోకెక్కిన ఓంకార్ సింగ్.. పిన్న వయసున్న పియానిస్ట్ గౌరీ మిశ్రా..తదితరులు బాల్ శక్తి అవార్డులు అందుకున్నారు. డౌన్ సిండ్రోమ్, మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొరక్ బిశ్వాస్ నాట్య రంగంలో అసాధారణ ప్రతిభ చూపడంతో ఈ అవార్డు అందుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 49 మందికి బాల్ శక్తి 2020 అవార్డుల ప్రదానం
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ
ఎందుకు : వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు
ప్రపంచ బాల మేధావిగా ఈశ్వర్ శర్మ
ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ పదేళ్ల స్కూల్ విద్యార్థి, బ్రిటిష్ ఇండియన్ ఈశ్వర్ శర్మను ప్రపంచ బాల మేధావి-2020 అవార్డుతో బ్రిటన్ సత్కరించింది. 30 విభిన్న (బైకింగ్, కొరియోగ్రఫీ, ఫిట్‌నెస్, మార్షల్ ఆర్‌ట్స తదితర) రంగాల్లో సత్తాచాటిన ప్రపంచంలోని 45 దేశాలకు చెందిన బాల మేధావులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో ఇంగ్లండ్‌లోని కెంట్ కేంద్రంగా పనిచేస్తున్న ఈశ్వర్ శర్మ యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. విద్యార్థులకు యోగా చాలా ముఖ్యం.’అని అవార్డు తీసుకుంటున్న సందర్భంగా శర్మ చెప్పాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ బాల మేధావి-2020 అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : బ్రిటిష్ ఇండియన్ ఈశ్వర్ శర్మ
ఎందుకు : ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ
పెద్దపల్లి జిల్లా స్వచ్ఛత దర్పణ్ అవార్డు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు ‘స్వచ్ఛత దర్పణ్ అవార్డు’ లభించింది. న్యూఢిల్లీలో జనవరి 12న జరిగిన కార్యక్రమంలో పాణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత సాధించినందుకుగాను జిల్లాకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ), సామాజిక మరుగుదొడ్లు’ అనే అంశంపై పెద్దపల్లి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛత దర్పణ్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : పెద్దపల్లి జిల్లా
ఎందుకు : పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరిచినందుకు
తెలంగాణ విద్యార్థిని అంజలికి ఇన్ఫోసిస్ అవార్డు
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని దారావత్ అంజలి ప్రఖ్యాత ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డు’ లభించింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వార్షిక సమావేశం సందర్భంగా జనవరి 4న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో అంజలికి ఇజ్రాయెల్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఆదా ఈజునాథ్, ఇస్కా అధికారులు ఈ అవార్డును అందజేశారు. కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త భారతరత్న అవార్డు గ్రహీత సీఎస్.రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ద్వారా ఏటా 10 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డును అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : తెలంగాణ విద్యార్థిని దారావత్ అంజలి

Published date : 27 Jan 2020 04:14PM